మద్యానికి బానిసై ఆత్మహత్య
తానూరు: మండలంలోని దాగాం గ్రామానికి చెందిన గాడేకర్ గులాబ్‌రావు (40) మద్యానికి బానిపై ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైయినీ ఎస్సై నవనీత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గులాబ్‌రావు కొన్నేళ్లుగా మద్యానికి బానిసై ఏ పనీ చేయకుండా ఇంటివద్దే ఉంటున్నాడు. మద్యం అలవాటు మానుకోవాలని పలుసార్లు కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోలేదు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా ట్రెయినీ ఎస్సై నవనీత్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య శాంతాబాయి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
జీవితంపై విరక్తితో వృద్ధురాలి బలవన్మరణం
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని కచికంటి గ్రా మానికి చెందిన కాసరపు భూలక్ష్మి (65) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ముజా హిద్ తెలిపిన వివరాల ప్రకారం.. భూలక్ష్మి ఎనిమి ది నెలల క్రితం పశువుల దాడిలో తీవ్రంగా గాయ పడ్డది. కుటుంబ సభ్యులు ఆమెకు చికిత్స చేయించినా ఆమె మంచానికే పరిమితమైంది. జీవితంపై విరక్తి చెంది శుక్రవారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. మృతురాలి కుమారుడు నర్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చెరువులో జారిపడి రైతు మృతి
నర్సాపూర్(జి): ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి రైతు మృతి చెందాడు. ఏఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తురాటి గ్రామానికి చెందిన రైతు ముక్కెర గంగాధర్ అలియాస్ గంగారెడ్డి (41) తన కొడుకు రిన్నుతో కలిసి ఎద్దులను కడగడానికి శుక్రవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని ఊర చెరువుకు వెళ్లాడు. చెరువులోకి దిగిన గంగాధర్ ప్రమాదవశాత్తు అందులో జారిపడి ఈతరాక నీటమునిగి మరణించాడు. గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో వెతకగా అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. చెరువులో అక్రమంగా జేసీబీలతో పెద్దపెద్ద గుంతలు తీయడంతోనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చెక్‌డ్యాంలో పడి మతిస్థిమితం లేని మహిళ మృతి
సారంగపూర్: మండలంలోని వంజర్ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ చాట్ల లక్ష్మి శుక్రవారం చెక్‌డ్యామ్‌లో పడి మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంజర్ గ్రామానికి చెందిన లక్ష్మి చిన్నప్పటి నుంచే మతిస్థిమితం లేక గ్రామంలో తిరుగుతుండేది. ఆమెకు కుటుంబ సభ్యులు, బంధువులెవరూ లేరు. గ్రామస్తులు అందించే భోజనం తింటూ ఉండేది. మూడు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు గాలింపు చేపట్టారు. గ్రామ సమీపంలోని చెక్‌డ్యామ్ వద్ద ఆమె మృతదేహం కనిపించగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రీకాంత్ ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో
కిందపడ్డ ఒకరికి గాయాలు
బెల్లంపల్లి: అతిగా మద్యం సేవించి కింద పడిపోయిన ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మోహన్ దుర్వే బెల్లంపల్లికి వచ్చాడు. పాత బస్టాండ్ వైన్‌షాపు వద్ద అతిగా మద్యం సేవించా డు. కాసేపటికే మద్యం మత్తులో కింద పడగా తల కు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో దేవయ్య వెంటనే మోహన్ దుర్వేను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి కి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మె రుగైన వైద్యం కోసం మంచిర్యాలకు రెఫర్ చేశారు.
అడవిపంది దాడిలో ఒకరి మృతి
ఇంద్రవెల్లి: అడవిపంది దాడిలో ఒకరు మృతి చెందారు. ఎస్సై సాయన్న, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దొడందా పంచాయతీ పరిధి చిలటిగూడ గ్రామానికి చెందిన మడావి బొజ్జు (58) ఆదే గ్రామానికి చెందిన పుసం నాందేవ్, మడావి మంతులు శుక్రవారం మేకలను మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. మేకలు మేస్తుండగా చెట్టు కింద కూర్చుని ఉన్న బొజ్జుపై అకస్మాత్తుగా అడవిపంది దాడి చేసింది. కడుపు, ఛాతి భాగంలో తీవ్రంగా గాయపరచగా బొజ్జు అక్కడికక్కడే మృతి చెందాడు. పుసం నాందేవ్, మడావి మంతులు చెట్టు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
యువతిని వేధించిన యువకుడిపై కేసు
బోథ్: మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని స్నాప్ చాట్ యాప్‌లో వేధించిన సాయి అనే యువకుడిపై ఎస్సై ప్రవీణ్‌కుమార్ శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సాయి స్నాప్‌చాట్ యాప్‌లో ఫేక్ ఐడీని క్రియేట్ చేసి బోథ్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని వేధింపులకు గురి చేశాడు. దీంతో సదరు యువతి షీటీంకు సమాచారం ఇచ్చింది. షీటీం సభ్యులు శుక్రవారం సాయిని పట్టుకుని బోథ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మహిళలు, యువతులు ఎలాంటి వేధింపులకు గురైనా 8712659953 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ప్రమాదవశాత్తు
రాడ్ కట్టర్ తగిలి ఒకరి మృతి
జైనథ్: మండల కేంద్రానికి చెందిన కోకన్ చంద్రకాంత్ (40) రాడ్ కట్టర్ తగిలి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వ చ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ ల కేంద్రంలోని ఓ ఇంటి వ ద్ద చంద్రకాంత్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు రాడ్ కట్టర్ ఎడమ చేయి వైపు పడింది. దీంతో అతడి చేతికి గాయమై తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి చంద్రకాంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
చికిత్స పొందుతూ
యువకుడి మృతి
ఆదిలాబాద్‌టౌన్: మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పెరాడి గ్రామానికి చెందిన కరాడే చంపత్ (27) రిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన చంపత్ ఈనెల 7న తన గ్రామంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మద్యానికి బానిసై ఆత్మహత్య
మద్యానికి బానిసై ఆత్మహత్య


