అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులపై హర్షం
బెల్లంపల్లి: అంగన్‌వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించడం హర్షనీయమని అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు భానుమతి, కార్యదర్శి రాజమణి అన్నారు. శుక్రవారం బె ల్లంపల్లి తిలక్ స్టేడియంలో విజయోత్సవ సభ నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ అంగన్‌వాడీ కేంద్రాలకు మే నెల సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లను ప్రమోట్ చేశారని, యూని యన్ పోరాట ఫలితంగానే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుందని వి వరించారు. గతంలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ర మణ, మాజీ జిల్లా అధ్యక్షుడు సంకె రవి, జిల్లా సహాయ కార్యదర్శి దూలం శ్రీనివాస్, మండల కన్వీనర్ దేవదాస్, నాయకులు అశోక్, అంగన్‌వాడీలు విరోనిక, సబిత, సత్యవతి, స్వాతి, అనురాధ, సువర్ణ, శంకరమ్మ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


