ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు
బెల్లంపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీఈ జేఏసీ) జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కె.వనజారెడ్డి అన్నారు. సోమవారం ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను కలిసి జేఏసీ నాయకులు సమస్యలు వివరించారు. ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 14లోపు ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో 15న నల్ల బ్యాడ్జీలతో నిరసన, ధర్నా, జూన్ 9న హైదరాబాద్‌లో మహాసదస్సు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 57 సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, డెప్యూటీ సెక్రెటరీ జనరల్ బి.రామ్మోహన్, కో చైర్మెన్ శ్రీపతి బాబురావు, నాయకులు చక్రపాణి, రవి, చెన్నకేశవులు, సుధాకర్, గోపాల్, వెంకటేశం, సంఘ సభ్యులు పాల్గొన్నారు.


