
ఆర్కే 7గని సింగరేణికే తలమానికం
● కంపెనీ డైరెక్టర్లు సత్యనారాయణరావు, వెంకటేశ్వర్లు ● ఘనంగా గని స్వర్ణోత్సవాలు
శ్రీరాంపూర్: ఆర్కే 7 గని సాంకేతికతలో సింగరేణికే తలమానికమని సింగరేణి డైరెక్టర్లు అన్నారు. గని 50సంవత్సరాలు జీవిత కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్(ఈఅండ్‌ఎం) డి.సత్యనారాయణరావు, డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు ముఖ్య అతి థులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీలోనే మొట్టమొదట ఎస్‌డీఎ ల్ యంత్రాలను ఈ గనిలోనే ప్రవేశపెట్టామని తెలి పారు. మ్యాన్ రైడింగ్ యంత్రాలనూ ఇక్కడే ప్రవేశపెట్టామని, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, రక్షణ చర్యల్లో గనికి మంచి చరిత్ర ఉందని అన్నారు. కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం ఉద్యోగుల కు జ్ఞాపికలు అందజేశారు. గనిపై మైసమ్మ ఆలయంలో హోమాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్, ఎస్టీపీపీ ఈడీ చిరంజీవులు, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం సుశాంత్ సాహూ, గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జట్టి శంకర్‌రావు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, బీఎంఎస్ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సీఐటీయూ ఉపాధ్యక్షుడు బాలాజీ పాల్గొన్నారు.