శ్రీరాంపూర్‌లో ఉత్తమ ఉద్యోగులు వీరే..
శ్రీరాంపూర్: సింగరేణి డేను పురస్కరించుకుని శ్రీరాంపూర్ ఏరియాలో ఇద్దరు ఉత్తమ ఉద్యోగులు, ఇద్దరు ఉత్తమ అధికారులను యాజమాన్యం ఎంపిక చేసింది. మంగళవారం జీఎం కార్యాలయం వద్ద జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వీరిని సన్మానించనున్నారు. ఉత్తమ ఉద్యోగులుగా ఆర్కే 5 గనిలో మున్సీగా పని చేస్తున్న గునిగంటి నర్సింగరావు, ఎస్సార్పీ 3 గనిలో ఫోర్‌మెన్‌గా పని చేస్తున్న కుమ్మరి మల్లేశం, ఉత్తమ అధికారులుగా ఐకే 1ఏ గనికి చెందిన ఇంజనీర్ రాకేశ్ సత్తయ్య వంగవార్, ఎస్సార్పీ ఓసీపీకి చెందిన సీనియర్ అండర్ మేనేజర్ మేడవేని వెంకన్న ఎంపికయ్యారు.
మందమర్రి ఏరియాలో..
మందమర్రిరూరల్: సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏరియాలోని ఉత్తమ అధికారులు, ఉద్యోగులను యాజమాన్యం ఎంపిక చేసింది. ఉత్తమ అధికారులుగా కేకే–ఓసీలో అండర్ మేనేజర్ మామిడి కుమారస్వామి, రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ పి.రాజ్‌కుమార్, ఉత్తమ ఉద్యోగులుగా కేకే– ఓసీ ఈపీ ఆపరేటర్ బుడెగ వేణుగోపాల్, కేక–5గనిలో కోల్ కట్టర్ బొల్లపల్లి శ్రీనివాస్ ఎంపికయ్యారు. వీరిని మంగళవారం ఏరియా జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించే వేడుకల్లో సన్మానించనున్నారు.
శ్రీరాంపూర్‌లో ఉత్తమ ఉద్యోగులు వీరే..


