డిజిటల్ లర్నింగ్ పుస్తకం ఆవిష్కరణ
మంచిర్యాలటౌన్: డిజిటల్ లర్నింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ అనే అంశంపై విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉపాధ్యాయుడు బి.రాజమౌళి రాసిన పుస్తకాన్ని డీఈవో యాదయ్య సోమవారం ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రోత్సహించేలా ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ పుస్తకాలను ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశపెట్టిందని డీఈవో తెలిపారు. పైథాన్ ప్రోగ్రాం లాంగ్వేజీని సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. డిస్ట్రిక్ట్ క్వాలిటీ కోఆర్డి నేటర్ సత్యనారాయణమూర్తి, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఐసీటీ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్ కోఆర్డినేటర్ బరత్, ప్రధానోపాధ్యాయురాలు ఐ.పద్మజ, కే.విజ యలక్ష్మీ, చౌదరి, మల్లేశ్, రాజకుమార్ పాల్గొన్నారు.


