గడ్డం వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి లోక్‌సభ సభ్యుడిగా గడ్డం వెంకటస్వామి అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో గడ్డం వెంకటస్వామి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహనీయులు ఆచరించిన మార్గాన్ని అనుసరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్, అధికారులు రౌఫ్‌ఖాన్, దుర్గప్రసాద్, హనుమంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్, ఈఆర్‌వోలు, ఏఆర్‌వోలతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ రోజుకు 10 వేల చొప్పున చేస్తూ నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బీఎల్‌ఓల వారీగా సమీక్ష నిర్వహించి పురోగతి లేని వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


