● మంత్రులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● అంబేడ్కర్‌ జయంతి వేడుకలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

● మంత్రులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● అంబేడ్కర్‌ జయంతి వేడుకలకు ఏర్పాట్లు

Apr 13 2025 12:11 AM | Updated on Apr 13 2025 12:11 AM

● మంత

● మంత్రులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● అంబేడ్కర్‌ జ

విగ్రహ పనులన్నీ పూర్తి చేయాలి

మంచిర్యాలటౌన్‌: అంబేడ్కర్‌ విగ్రహ పనులను ఈ నెల 13న సాయంత్రంలోపు పూర్తి చే యాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కొనసాగుతున్న అంబేడ్కర్‌ విగ్రహ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ నెల 14న అంబేడ్కర్‌ 134వ జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అంబేద్కర్‌ జయంతి రోజునే మంచిర్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు చొరవతో ఈ నెల 14న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పౌరసరఫరాల, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరు కానున్నారు. ఈ క్రమంలో పలు శాఖలకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేస్తారు. జిల్లా కేంద్రంలో బైపాస్‌ అమరవీరుల స్తూపం మీదుగా రంగంపేట వైపు పాత మంచిర్యాల వరకు ఆరు వరుసల రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. గోదావరి వరదలతో ముంపు రాకుండా రాళ్లవాగుపై నిర్మించనున్న రక్షణ గోడ పనులు ప్రారంభిస్తారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరిస్తారు. తర్వాత జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పరిశీలిస్తారు. అనంతరం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంబేడ్కర్‌ జయంతి వేడుకలతోపాటు ఇతర అభివృద్ధి పనులకు మోక్షం కలుగనుంది. సాయంత్రం జిల్లా కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

హామీలు కురిపిస్తారా?

సీఎల్పీ నేతగా అసెంబ్లీ ఎన్నికల ముందు జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన డిప్యూటీ సీఎం ‘భట్టి’ స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్‌కు ఆప్తులుగా ఉన్నారు. చాలా రోజులుగా ఆయన చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయించాలని ప్రణాళిక వేస్తున్నప్పటికీ వీలు కాలేదు. తొలిసారిగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉన్న ‘భట్టి’తో పలు హామీలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పార్టీ అధికారంలోకి రాగానే మంచిర్యాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీలు ఇచ్చారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పర్యటనలో అభివృద్ధి కోసం నిధుల ఇచ్చేలా హామీలు తీసుకునే అవకాశం ఉంది.

బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేయాలి

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 14న నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యే సమావేశం కావడంతో పెద్ద ఎత్తున వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేలా చేపడుతున్న ఏర్పాట్లును శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు.

● మంత్రులతో అభివృద్ధి పనులకు  శంకుస్థాపన ● అంబేడ్కర్‌ జ1
1/1

● మంత్రులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● అంబేడ్కర్‌ జ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement