రెండు బార్లకు దరఖాస్తుల ఆహ్వానం
మంచిర్యాలక్రైం: జిల్లాలో రెన్యూవల్ చేసుకో కుండా ఆగిపోయిన రెండు బార్లకు తిరిగి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి కేజీ.నందగోపాల్ తెలిపారు. శుక్రవా రం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో, బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒక్కో బార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కలెక్టరేట్, ఆదిలాబా ద్‌లోని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయంలో ఈ నెల 26ఉదయం 10:30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు అందజేయవచ్చని తెలిపారు. 29న లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. రూ.లక్ష దరఖాస్తు ఫీజు చెల్లించాలని, ఎంపికై న వారు బార్లకు ఏడాదికి రూ.42లక్షలు ట్యాక్స్ రూంలో చెల్లించాల్సి ఉంటుందని తెలి పారు. సీఐలు గురువయ్య, సమ్మయ్య, ఇంద్రప్రసాద్, హరి పాల్గొన్నారు.


