● డీసీపీ ఎగ్గడి భాస్కర్ ● అర్ధరాత్రి పెట్రోలింగ్
మంచిర్యాలక్రైం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. గురువారం రాత్రి ముస్లింలు షబ్ ఏ ఖద్ర్ జుగ్‌నేకి రాత్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటు చేసుకోకుండా డీసీపీ పోలీసు సి బ్బందితో కలిసి అర్ధరాత్రి నుంచి ఉదయం నాలుగు గంటల వరకు పెట్రోలింగ్ నిర్వహించారు. మజీద్‌లు, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బ స్టాండ్, రైల్వేస్టేషన్, బెల్లంపల్లి చౌరస్తా, ఐబీ చౌరస్తా ప్రధాన కూడళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను ప్రశ్నించి వివరాలు, ఆధార్, వేలిముద్రలు సేకరించా రు. మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రం సందర్శన
నస్పూర్: పట్టణ పరిధిలోని సీసీసీ సింగరేణి హైస్కూల్‌లో పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని డీసీపీ భాస్కర్ శుక్రవారం సందర్శించారు. అధికారులతో మాట్లాడి పరీక్షల తీరుపై తెలుసుకున్నారు.


