
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో సుబ్బరాయుడు
మంచిర్యాలటౌన్: ‘‘కాసు’పత్రులు శీర్షికన ఈ నెల 8న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. అర్హత లే ని వైద్యులతో రోగులకు చికిత్స అందిస్తూ, సూపర్, మల్టీస్పెషాలిటీ పేరిట ఆస్పత్రులు నెలకొల్పి వైద్యులు లేకున్నా వారి పేర్లతో ఇతరులు వై ద్యం అంది స్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రైవేటు ఆస్పతుల నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్ట ర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రతీ ప్రైవేటు ఆస్పత్రిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో నమోదు ఉన్న వైద్యులు, అర్హతలు, వైద్యం అందించే వివరాలు బో ర్డుపై ఉండాలని తెలిపారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుల వివరాలు నమోదు చేయించుకోవాలని, లే ని వారి పేర్లను తొలగించాలని అన్నారు. కన్సల్ట్ వై ద్యులు ఏ సమయానికి వస్తారు, ఫీజు వివరాలు ప్ర దర్శించాలని, ఆసుపత్రిలో రిజిస్టర్ అయిన వైద్యు డు ఒక ఏడాదిపాటు ఉండేలా చర్యలు తీసుకోవా లని సూచించారు. క్వాలిఫైడ్ పారామెడికల్ స్టాఫ్ ఉండాలని, అంబులెన్సుల ద్వారా వచ్చిన రోగికి సంబంధించిన కేస్ వివరాలను ప్రత్యేక రిజిష్టరులో నమోదు చేయాలని తెలిపారు. ఆసుపత్రి నుంచి పంపే కేసులను నమోదు చేసి, అంబులెన్సులకు సంబంధించి న వివరాలను నమోదు చేయాలని, ఫీజు వివరాలు రెండు, మూడు స్థలాల్లో ప్రదర్శించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
