జాతీయ పురస్కారానికి ‘గొల్లపల్లి’

నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలోని వైకుంఠధామం - Sakshi

● ప్రతిపాదిస్తూ నివేదిక పంపిన ప్రభుత్వం ● జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి 27 పంచాయతీలు ● నేడు రాష్ట్రాస్థాయి పురస్కారాలు అందుకోనున్న జీపీలు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందజేసే ‘దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతత్‌ వికాస్‌ పురస్కార్‌’కు మంచిర్యాల జిల్లా నుంచి నెన్నెల మండలంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీ ఎంపికై ంది. 9 అంశాల్లోనూ అత్యధిక మార్కులు సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయి పురస్కారంతో పాటు జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ పురస్కారాన్ని అందుకోబోనుంది. నేడు హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి పురస్కారం అందుకోనుంది.

ఎంపికై న గ్రామాలు... విభాగాల వారీగా

జిల్లాలోని 16 మండలాల్లోని 310 గ్రామాల్లో 27 గ్రామ పంచాయతీలను రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపిక చేశారు. అందులో మండలంలోని ముత్యంపల్లి, భీమిని మండలంలోని మల్లిడి, బెల్లంపల్లి మండలంలోని అంకుశం గ్రామాలు ఎంపికయ్యాయి. ఆరోగ్యవంతమైన పంచాయతీలుగా హాజీపూర్‌ మండలంలోని గుడిపేట, భీమిని మండలంలోని లక్ష్మీపూర్‌, చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయతీలుగా భీమిని మండలంలోని లక్ష్మీపూర్‌, చిన్నగుడిపేట, బెల్లంపల్లి మండలంలోని కన్నాల్‌, నీటి వనరులు పుష్కలంగా ఉన్న పంచాయతీలుగా హాజీపూర్‌ మండలంలోని కర్ణమామిడి, బెల్లంపల్లి మండలంలోని బుదాఖుర్ద్‌, తాండూర్‌ మండలంలోని గోపాల్‌నగర్‌, పచ్చదనం, పరిశుభ్రత విభాగంలో భీమిని మండలంలోని భిట్టూర్‌పల్లి, లక్ష్మీపూర్‌, వేమనపల్లి మండలంలోని వేమనపల్లి, స్వయం సమృద్ది, మౌలిక సదుపాయాలు ఉన్న పంచాయతీలుగా హాజీపూర్‌ మండలంలోని గుడిపేట, జన్నారం మండలంలోని పోన్కల్‌, దండేపల్లి మండలంలోని మాదరిపేట, సామాజిక భద్రత కలిగిన పంచాయతీలుగా నెన్నెల మండలంలోని గొల్లపల్లె, కాసీపేట మండలంలోని కోమటిచెను, దండేపల్లి మండలంలోని తానిమడుగు, సుపరిపాలన పంచాయతీలుగా కన్నెపల్లి మండలంలోని జన్కాపూర్‌, భీమిని మండలంలోని చిన్నగుడిపేట, లక్ష్మీపూర్‌ గ్రామాలు, మహిళా స్నేహపూర్వక పంచాయతీలుగా దండేపల్లిలోని కొండాపూర్‌, నెన్నెల మండలంలోని గుండ్లసోమారం, జన్నారం మండలంలోని లింగాలపల్లి గ్రామాలు ఎంపికయ్యాయి.

ఉత్తమ గ్రామ పంచాయతీగా ‘మార్లవాయి’

కెరమెరి(జైనూర్‌): నేషనల్‌ పంచాయతీ అవార్డుల్లో భాగంగా ఇప్పటికే మండల, జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు పొందిన జైనూర్‌ మండలంలోని మార్లావాయి గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికై ంది. ‘పేదరిక రహిత, మెరుగైన మౌళిక సదుపాయాలు’ అనే అంశంలో ఈ గ్రామ పంచాయతీ ఎంపికై ంది. ఈ మేరకు మార్లవాయి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ కనక ప్రతిభ వెంకటేశ్వర్‌, గ్రామ కార్యదర్శి మనోజ్‌ హైదరాబాద్‌కు బయలు దేరారు.

సమష్టి కృషితో గుర్తింపు

మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ ఉత్తమ పంచాయతీ పురస్కారానికి వరసగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక అవుతామన్న నమ్మకానికి గ్రామస్తులు పూర్తి సహకారం తోడు కాగా అధికారులు, ప్రజాప్రతినిధుల తోడ్పాటు మరింత బలాన్ని చేకూర్చింది.

– ఇందూరి శశికళ, సర్పంచ్‌, గొల్లపల్లి

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top