ఫారెస్టు అధికారులకు నిరసన సెగ | - | Sakshi
Sakshi News home page

ఫారెస్టు అధికారులకు నిరసన సెగ

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

వెల్దండ: డిండి–నార్లాపూర్‌ ప్రాజెక్టులో భాగంగా వెల్దండ మండలం అజిలాపూర్‌–ఇర్విన్‌ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులు బుధవారం చెట్ల సర్వేను అడ్డుకొని నిరసన తెలిపారు. రిజర్వావయర్‌లో భాగంలో అజిలాపూర్‌లో 110 చెట్లు కోల్పోతున్నట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. నాగర్‌కర్నూల్‌ ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్‌ సుబ్బుర్‌ ఆధ్వర్యంలో దాదాపుగా 30మంది ఫారెస్టు అధికారులతో చెట్లను సర్వే చేసేందుకు గ్రామానికి వెళ్లారు. విషయం గుర్తించిన గ్రామస్తులు ఒక్కసారిగా ఫారెస్టును అధికారుల వద్దకు వచ్చి ఎలాంటి సమాచారం లేకుండా సర్వే ఎలా చేస్తారని అధికారులను అడ్డుకున్నారు. వెల్దండ సీఐ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో వెల్దండ, చారకొండ, కల్వకుర్తి పోలీస్‌స్టేషన్ల నుంచి భారీగా పోలీసులు వచ్చి గ్రామస్తులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తులు మాట్లాడుతూ.. రైతులకు నష్టపరిహారంపై ప్రభుత్వ ఎలాంటి హామీ ఇవ్వకుండా భూ సర్వే, చెట్ల సర్వే చేపట్టొదని నిలదీశారు. తహసీల్దార్‌ కార్తీక్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని రైతుల డిమాండ్లను జిల్లా అధికారులకు అందించామన్నారు. ప్రభుత్వం పూర్తి సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తుందన్నారు.

భయాందోళనలో గ్రామస్తులు

గ్రామానికి ఒక్కసారిగా భారీగా పోలీసులు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెల్దండ సర్కిల్‌ పరిధిలోని చారకొండ, వెల్దండ పోలీస్‌స్టేషన్‌, కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌ నుంచి దాదాపుగా ఎస్‌ఐలు యుగంధర్‌రెడ్డి, వీరాబాబుతోపాటు దాదాపుగా 40మందికి పైగా పోలీసులు వచ్చారు. గ్రామంలో ఒక్కసారిగా పోలీసులు అధిక సంఖ్యలో రావడంతో ఆందోళన చెందారు.

చివరికి సర్వే చేపట్టారు

రైతుల డిమాండ్లకు ఒప్పుకుంటున్నట్లు తహసీల్దార్‌ కార్తీక్‌కుమార్‌ వారికి హామీ ఇవ్వడంతో రైతులు సర్వేకు అంగీకరించారు. మధ్యాహ్న 2గంటల తర్వాత ఫారెస్టు అధికారులు రైతుల సమక్షంలో చెట్లను సర్వే పూర్తి చేశారు. వ్యవసాయ పొలంలోని వేపచెట్లు, తుమ్మచెట్లు, తదితరవాటిని గుర్తించిన అధికారులు నష్టపరిహారం అంచనా వేస్తామని రైతులకు సూచించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్‌ సుబ్బుర్‌, ఈశ్వర్‌, డీఆర్‌ఓలు సాధిక్‌, రేణుక, మల్లేష్‌, సీతా, సీఐ రఘువీర్‌రెడ్డి, ఆర్‌ఐ శంకర్‌, సర్పంచ్‌ రమేష్‌గౌడ్‌, గ్రామస్తులు, రైతులు ఉన్నారు.

ఇర్విన్‌ రిజర్వాయర్‌లో భూములు కోల్పో తున్న రైతులకు న్యాయం చేసి ఆదుకోవాలన్నారు. ఎంత భూమి కోల్పోయిన ప్రభుత్వం మరోచోట భూమి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కోడంగల్‌లో ఒక న్యాయం మా అజిలాపూర్‌ రైతులకు మరో న్యాయం చేస్తారా అని ఆరోపించారు. రిజర్వాయర్‌లో భూమి కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే భూ సర్వే, చెట్ల సర్వే చేయాలని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్‌, కల్వకుర్తి ఎమ్మెల్యే, ఎంపీలు గ్రామానికి వచ్చి రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

అజిలాపూర్‌లో చెట్ల సర్వేను

అడ్డుకున్న రైతులు

సమాచారం లేకుండా సర్వే ఎలా చేస్తారని నిలదీత

ఎకరానికి రూ.20లక్షలు చెల్లిస్తేనే

రిజర్వాయర్‌ నిర్మించాలి

వ్యవసాయ భూమిని కోల్పోతున్నట్లు రైతుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement