జడ్చర్ల టౌన్: పట్టణంలోని డా.బీఆర్‌ఆర్ ప్రభు త్వ డిగ్రీ కళాశాల థాట్‌ఫ్లోస్ మెడికల్ కోడింగ్ శిక్షణ సంస్థతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. కళాశాల రసాయనశాస్త్ర విభాగం, తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ సంస్థతో కలిసి బుధవారం ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్ సందర్భంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు త్వరగా ఉద్యోగాలు పొందేందుకు మెడికల్ కోడింగ్ రంగం మంచి అవకాశాలు కల్పిస్తుందన్నారు. విద్యతోపాటు ఉద్యోగాలకు అవ సరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకో వాలన్నారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన పాలమూరు యూనివర్సిటీ రసాయనశాస్త్ర విభాగాధిపతి ఎస్ విజయలక్ష్మి మాట్లాడు తూ ఆరోగ్య భీమా వ్యవస్థలో మెడికల్ కోడింగ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. భవిష్యత్తులో ఈ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు అందుబా టులోకి రానున్నాయన్నారు. కార్యక్రమంలో రసాయనశాస్త్ర విభాగాధిపతి డా.రుకియాభాను, టీఎస్‌కేసీ సమన్వయకర్త విక్రమ్‌కుమార్, మెంటార్ వీరప్రతాప్, అధ్యాపకులు మాధురి, సతీష్‌రెడ్డి, ఆంజనేయులు, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, రజని, భార్గవి పాల్గొన్నారు.


