ఈ నెలలోనే ‘పేట’ కోర్టు భవనానికి స్థల సేకరణ | - | Sakshi
Sakshi News home page

ఈ నెలలోనే ‘పేట’ కోర్టు భవనానికి స్థల సేకరణ

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

నారాయణపేట: జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు భవన నిర్మాణానికి అవసరమైన 15 ఎకరాల స్థల సేకరణ ప్రక్రియను ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి, నారాయణపేట–వనపర్తి పోర్ట్‌ఫోలియో జడ్జి అనిల్‌ తెలిపారు. కోర్టు భవన నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టేందుకు స్థల సేకరణను వేగవంతం చేయాలని కోరుతూ బుధవారం నారాయణపేట, మక్తల్‌ బార్‌ అసోసియేషన్లకు చెందిన న్యాయవాదులు హైదరాబాద్‌లో జడ్జి అనిల్‌ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు భవనానికి స్థలం సమకూర్చి, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన జడ్జి అనిల్‌.. 15 ఎకరాల స్థల సేకరణకు త్వరలోనే చర్యలు చేపడతామని, ఈ నెలలోనే ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల బృందంలో నారాయణపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు నందు నామాజీ, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, మక్తల్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తిమ్మన్నతో పాటు సలీం, భీమ్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

11న ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారుల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: నారాయణపేట జిల్లా మరికల్‌ మండలకేంద్రంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈనెల 11వ తేదీన ఉమ్మడి జిల్లాస్థాయి ఖోఖో జూనియర్‌ బాల, బాలికల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఉబేదుల్లా కొత్వాల్‌, జీఏ విలియం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 01.01.2009 తర్వాత జన్మించిన వారై ఉండాలని తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్‌ ఆధార్డ్‌కార్డు, బోనఫైడ్‌ ధృవపత్రాలతో ఎంపికలకు హాజరుకావాలని, మిగతా వివరాల కోసం పీడీ వెంకటేశ్‌ (8639091977) సంప్రదించాలని వారు సూచించారు. ఎంపికయ్యే జట్లు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 15 నుంచి 17 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

22 నుంచి స్వయం ఉపాధి శిక్షణ

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఈనెల 22వ తేదీ నుంచి 22వ బ్యాచ్‌ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అఽధికారి జె.రాజశేఖర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌ గల యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్‌ డిజైనింగ్‌, గార్మెంట్‌ తయారీ, బ్యూటీషియన్‌, కంప్యూటర్‌ కోర్సు (ఎంఎస్‌ ఆఫీస్‌), రిఫ్రిజిరేషన్‌, ఏసీ, మొబైల్‌ సర్వీసింగ్‌, రిపేరుపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్‌ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని, 3 నెలల శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్‌ సెట్విన్‌ వారు సర్టిఫికెట్‌ ఇస్తారని వివరించారు. ఆసక్తిగల వారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. దరఖాస్తు వెంట విద్యార్హత, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోతో జతచేయాలని కోరారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మిగతా వివరాలకు కేంద్రం ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి (94407 88502)ను సంప్రదించాలని సూచించారు.

ద్విచక్రవాహనం ఢీ.. మహిళ మృతి

కందనూలు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ మండలం తూడుకుర్తికి చెందిన రామటి అలివేల (57) ఈనెల 4న బస్టాండ్‌ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి బైక్‌ తగిలించడంతో కిందపడి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఆమె మేనల్లుడు శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement