సైబర్‌ నేరాల కట్టడికి అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాల కట్టడికి అప్రమత్తత అవసరం

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: ఆన్‌లైన్‌ మోసాలు, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల పేరుతో మోసాలు, నకిలీ జాబ్‌ ఆఫర్లతో జరుగుతున్న సైబర్‌ నేరాల పట్ల యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం డీఎస్పీలు గిరికుమార్‌, వెంకటేశ్వర్లు సూచించారు. సైబర్‌ జాగృక్త దివస్‌లో భాగంగా బుధవారం స్థానిక ఎన్‌టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీలు మాట్లాడుతూ వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏపీకే ఫైల్స్‌, అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయరాదన్నారు. ఓటీపీ, పిన్‌, సీవీవీ, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. ప్రజలను నమ్మించేందుకు సైబర్‌ నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలను అనుసరిస్తున్నారని, అప్రమత్తతే మోసాలకు అడ్డుకట్ట వేస్తుందని తెలిపారు. అనంతరం పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సైబర్‌ క్రైం ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement