రాజాపూర్ (బాలానగర్): రైతులు మామిడి తోటలో కొమ్మలు కత్తిరించేందుకు యంత్రాలను వినియోగించడం ద్వారా పని సులువవుతుందని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త ప్రొఫెసర్, రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, సైంటిస్ట్ డాక్టర్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి, జాలుగడ్డతండాలోని రైతు కృష్ణారెడ్డి మామిడి తోటలో యంత్రాలను ఉపయోగించి శాసీ్త్రయ పద్ధతిలో కొమ్మలను కత్తిరించడంపై అవగాహన కల్పించారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి మామిడి దిగుబడులు తగ్గడానికి ప్రధాన కారణం చెట్టు లోపలి భాగాలకు గాలి, వెలుతురు సరిగ్గా తగలకపోవడం, కొమ్మలు ముదరక పోవడమే అన్నారు. జూన్, జూలై నెలల్లో సరైన క్యానోి ప, ఫ్రూనింగ్ చేయడం ద్వారా వచ్చే ఏడాది మంచి పూత, కాపు చేయవచ్చన్నారు. దిగుబడి తగ్గిన చెట్లలో పోషకాల నిల్వలు ఎక్కువగా ఉంటాయని, ఇప్పుడు కత్తిరింపు చేయకపోతే వర్షాకాలంలో చెట్టు విపరీతంగా పెరిగి శీతాకాలంలో పూత రాకుండా కేవలం ఆకులు మాత్రమే వస్తాయని వివరించారు. అధిక సాంద్రత గల మామిడి తోటల్లో ఉత్తమ నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ట్రాక్టర్‌తో నడిచే ట్రీపూనర్, పెట్రోల్‌తో నడిచే ప్రూనింగ్ మెషిన్‌తో కత్తిరింపు పద్ధతులను ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ, పట్టుపరిశ్రమ అధికారి వేణుగోపాల్, జడ్చర్ల ఉద్యానవన అధికారి మహేందర్, మామిడి క్లస్టర్ అధికారి ఆసీఫ్, మామిడి రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ బోట్లను
అడ్డుకున్న ఆంధ్ర పోలీసులు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల సమీపంలోని కృష్ణానది బ్యాక్ వాటర్ నుంచి ఆంధ్ర సరిహద్దులో ఉన్న సంగమేశ్వరాలయానికి భక్తులను తరలిస్తున్న స్థానిక మరబోట్లను మంగళవారం అవతలి ఒడ్డున ఆంధ్ర పోలీసులు అడ్డుకున్నారని బో టు యజయానులు తెలిపారు. ఇటీవల ఆంధ్ర ప్రాంతంలోని నదిలో మరబోటులో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రమాదానికి గురైన నేపథ్యంలో నాటు పడవలు నడపకుండా నిలువరించారని పేర్కొన్నారు. దాదాపుగా రెండు గంటలు బోట్లు ఆగడం వల్ల సోమశిల నుంచి సంగేమేశ్వరం వెళ్లే భక్తులు, పర్యాటకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం యథావిధిగా నాటు పడవల ప్రయాణం కొనసాగించారు.


