బయలెల్లుతున్న గ్రామాలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: గ్రామంలో అనుకోని విపత్కర సంఘటనలు, అశుభాలు దరిచేరకుండా.. ఏడాదికోసారి నిర్వహించేదే గంపజాతర. ప్రతి ఏటా ఫిబ్రవరి ప్రారంభం నుంచి మే నెల వరకు ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ఏదో ఒకరోజు ఈ గంపజాతర నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి వంట పాత్రలు, వంటకు కావాల్సిన సరుకులు తీసుకొని ఒక గంపలో పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి గ్రామాన్ని వదిలిపెడతారు. గంపను నెత్తిపై పెట్టుకొని ఊరు చివర, పంట పొలాల వద్ద చెట్లకిందకెళ్లి అక్కడే వంటలు చేసుకొని పిల్లాపాపలతో గడుపుతారు. ఏడాదిసారి ఇలా చేస్తే అంటురోగాలు రావని, పట్టిన దారిద్య్రం వదులుంతుందనేది ప్రజల్లో గట్టి నమ్మకం. గంపజాతర కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో జరుపుకొంటున్నారు.
ఇళ్లకు తాళాలు..రోజంతా వనవాసాలు
పిల్లాపాపలు, బంధుమిత్రులతో కలిసి విందులు
ప్రతి సంవత్సరం ఆచారంగా జాతర నిర్వహణ
అంటురోగాలు, దారిద్య్రం పోతుందనే నమ్మకం
ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కొనసాగింపు


