ఇది ప్రజారంజక బడ్జెట్. ముఖ్యంగా చేయూత పథకం కింద కొత్తగా 2లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం అభినందనీయం. అలాగే విద్యారంగానికి పెద్దపీట వేయడం మా ప్రజాపాలనకు అద్దం పడుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం అమలు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు తమ పిల్లలను బడికి పంపేందుకు ముందుకు వస్తారు. రైతుభరోసాకు నిధులు కేటాయించడం రైతులపై మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. వైద్యరంగానికి సైతం పెద్దఎత్తున నిధులు కేటాయించడంతో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించినట్లయ్యింది. – జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల
అంకెలగారడీ
కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చటగా మూడవసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకెలగారడీగా ఉంది. ప్రజలను బడ్జెట్ రూపంలో మరోమారు మోసం చేసింది. ఎన్నికల సమయంలో పింఛన్లు రూ.2వేల నుంచి రూ. 4వేలకు పెంచుతామని చెప్పి.. దాన్ని ఊసే ఎత్తడం లేదు. బడ్జెట్‌తో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. కొత్త ఉద్యోగాల ఊసేలేదు. మహాలక్ష్మి పథకం అంటూ ఆర్టీసీని పూర్తిగా నష్టాల్లోకి నెట్టేశారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకే బడ్జెట్‌లో అంకెలు చూయించారు.
– సి.లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
●


