ఈద్గా వద్ద ప్రత్యేక బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

ఈద్గా వద్ద ప్రత్యేక బందోబస్తు

Mar 21 2026 6:14 AM | Updated on Mar 21 2026 6:14 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: నగరంలో శనివారం రంజాన్‌ సందర్భంగా శుక్రవారం అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం ఈద్గా దగ్గర బందోబస్తు ఏర్పాట్లపై పరిశీలించారు. ఉదయం 9.30గంటలకు నిర్వహించనున్న ఈద్‌ ఉల్‌ ఫితర్‌ నమాజ్‌కు భారీ సంఖ్యలో ముస్లింలు హాజరుకానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడంపై అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా ఆ మార్గంలో ట్రాఫిక్‌ సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నమాజ్‌ కోసం వారి వాహనాల పార్కింగ్‌ నిర్వహణపై కూడా దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ కూడలి, బోయపల్లి గేట్‌ దగ్గర రద్దీ క్రమంలో ట్రాఫిక్‌ సమస్య రాకుండా చూడాలని, ఆ తర్వాత ఈద్గా దగ్గర పార్కింగ్‌ సక్రమంగా చేసే విధంగా చూడాలన్నారు. వీఐపీఐ వచ్చిన సమయంలో ఎలాంటి సమస్య లేకుండా ముదస్తు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టూటౌన్‌ సీఐ ఇజాజుద్దీన్‌, ట్రాఫిక్‌ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

● మహబూబ్‌నగర్‌ ఎస్పీ కార్యాలయంలోని మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో హైడ్రాలిక్‌ లిప్ట్‌ నిర్మాణం కోసం శుక్రవారం జిల్లా ఎస్పీ డి.జానకి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ శాఖలో వాహనాల నిర్వహణ అత్యంత కీలకమని, హైడ్రాలిక్‌ లిప్ట్‌ ద్వారా వాహనాలకు మరమ్మతులు సులువుగా చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఎన్‌బీ రత్నం, సురేష్‌కుమార్‌, డీఎస్పీలు రమణారెడ్డి, బాలాజీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement