అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Mar 21 2026 6:14 AM | Updated on Mar 21 2026 6:14 AM

దేవరకద్ర: మున్సిపాలీటీలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ కుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం మున్సిపాలీటీలోని 7వార్డులో ఇందిమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించారు. నిర్మాణాలు పూర్తి చేస్తున్నా నాల్గవ విడత డబ్బులు రాలేదని పలువురు లబ్ధిదారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులు సాంకేతిక సమస్య కారణంగా అప్‌లోడ్‌ చేయలేదని మున్సిపల్‌ కమిషనర్‌ను తప్పదోవ పట్టించినట్లు, అలాగే సాంకేతిక సమస్య లేనట్లు కలెక్టర్‌ స్వయంగా గుర్తించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన మున్సిపల్‌ మేనేజర్‌, వార్డు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో దశల వారీగా ఫోటోటు యాప్‌లో క్యాప్చర్‌ చేయడంలో జాప్యం చేయవద్దని, జాప్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు.

గురుకుల పాఠశాల తనిఖీ..

దేవరకద్రలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల, డీగ్రీ కళాశాలలో మౌలిక వసతులు మెరుగు పర్చాలని సూచించారు. తరగతి గదులను పరిశీలించి మధ్యాహ్నా భోజనాన్ని రుచి చూశారు. పాఠశాలలో తగినన్ని ఫ్యాన్లు లేక పోవడంపై ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దీపిక, ఎంపీడీఓ శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌ నరేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement