మక్తల్: క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తన వంతు సహకారం అందిస్తానని వీజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ వర్కటం జగన్నాథ్‌రెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన క్రీడాకారులు శ్రీనివాస్‌గౌడ్, శివాణి, అక్షిత, జాహ్నవి, జయకాత్యాయని, తన్మయ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అండర్–19 క్రికెట్, ఇతర క్రీడల్లో సత్తా చాటడంతో వారిని తన కార్యాలయానికి పిలిపించి సన్మానించి అభినందించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ సేవలో వీజేఆర్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని పేర్కొ న్నారు. వీజేఆర్ నిర్వాహకులు అంజనారెడ్డి, క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు.


