సీఎంను కలిసిన ఎమ్మెల్యే యెన్నం | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన ఎమ్మెల్యే యెన్నం

Mar 21 2026 6:14 AM | Updated on Mar 21 2026 6:14 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డిని శుక్రవారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తనను ప్రభుత్వ విప్‌గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని.. అసెంబ్లీలో ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, విజయరమణారావు, వేముల వీరేశం, శాసనమండలి ప్రభు త్వ విప్‌లు అద్దంకి దయాకర్‌, బల్మూర్‌ వెంకట్‌ తది తరులు పాల్గొన్నారు. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఎమ్మెల్యే యెన్నం కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement