లాభసాటిగా అల్లం పంట సాగు | - | Sakshi
Sakshi News home page

లాభసాటిగా అల్లం పంట సాగు

Mar 22 2026 5:49 AM | Updated on Mar 22 2026 5:49 AM

రకాలు–లభ్యత :

ఎరువులు

అలంపూర్‌: వ్యవసాయంలోను నూతన పంటల సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయ పంటల సాగులో వస్తున్న నష్టాల నుంచి గట్టెక్కడానికి అన్నదాతలు వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రికరిస్తున్నారు. ఆ కోణంలోనే అల్లం పంట సాగు చేసి లాభాలను ఆర్జిస్తున్నారు. వరి కంటే తక్కువ నీటి వినియోగంతో అల్లం పంట సాగు చేసే అవకాశం ఉండటంతో అనేక మంది రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్‌ రైతులకు అల్లం పంట సాగుకు సంబంధించి పలు సూచనలు చేశారు.

అనువైన నేలలు

అల్లం సాగుకు ఎర్ర నేలలు అనువుగా ఉంటాయి. నీరు నిల్వ ఉండని నేలలు అయితే సాగుకు అనుకూలం. వరి సాగుతో పోల్చితే నీటి వినియోగం చాలా తక్కువ. ఒక ఎకరా పొలంలో వరి సాగు చేయడానికి కావాల్సిన నీటితో ఒక్కటిన్నర ఎకరంలో అల్లం సాగు చేసుకొనే వెసలుబాటు ఉంటుంది.

పంట కాలం

అల్లం పంట ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో చేతికి అందుతుంది.

దుక్కి ఇలా...

అల్లం సాగులో దుక్కి చాలా ముఖ్యమైనది. దుక్కిని 30 సెంటీమీటర్ల లోతు వరకు దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 ట్రక్కుల బాగా చిలికిన పశువుల ఎరువు, 150 కిలోల సూపర్‌, 30 కిలోల పొటాష్‌ వేసుకోవాలి. కనీసం 30 సెంటీమీటర్ల ఎత్తు, బొదె పైభాగం, 90 సెంటీమీటర్లు ఉండేలా 4 అడుగుల వెడల్పుతో బొదెలు తయారు చేసుకోవాలి. నీటి తడుల కోసం బొదెల మధ్య ఇన్‌లైన్‌ డ్రిప్‌ అమర్చుకోవాలి.

విత్తన మోతాదు

ఎకరానికి 1000 కిలో విత్తనం అవసరం అవుతుంది. 20 రోజుల పాటు కుప్పగా వేసి మండె కట్టాలి. మండె కట్టిన 20 రోజుల తర్వాత విత్తిన దుంపలు చిన్న చిన్న మొలకలు రాగానే వాటిని 30 గ్రామాల బరువు ఉండేలా కత్తిరించాలి. వీటిని లీటర్‌ నీటికి 3 గ్రాముల మాంకోజెబ్‌, 2 మిల్లీ లీటర్ల క్లోరోఫైరిపాస్‌ కలిపి 30 నిమిషాలు నానబెట్టి భూమిలో విత్తాలి. విత్తిన 3–5 వారాల్లో పూర్తిగా మొలక వస్తోంది. ప్రతి రోజు 6 గంటల పాటు డ్రిప్‌తో నీటిని అందించాలి.

విత్తే సమయం

సాధారణంగా రైతులు జూన్‌ మాసంలోనే అల్లం పంట సాగు చేసుకోవచ్చు. నీటి పారుదల ఉంటే ఫిబ్రవరిలో లేదా మార్చి నెలలో నాటుకున్న ఉత్తమమైనదే.

తెగుళ్ల యాజమాన్యం :

అల్లం సాగులో ప్రధానంగా దుంప కుళ్లు తెగులే, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశిస్తుంది. వీటి వలన 30 నుంచి 50 శాతం వరకు పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. దుంప కుళ్లును గుర్తించినట్లయితే మెటలాక్సిల్‌ 1 గ్రాము లీటర్‌ నీటిలో కలిపి వేరు ప్రాంతం తడిచేలా పోయాలి. ఈ విధంగా పది రోజుల వ్యవధిలో రెండు సార్లు చేయాల్సి ఉంటుంది.

వేడి గాలుల నుంచి రక్షణ :

అల్లం మొలకెత్తిన తర్వాత బొదెలకు రెండు వైపులకు కింది భాగంలో 30 సెంటీమీటర్ల దూరంలో మొక్కజొన్న నాటుకోవాలి. దీని వలన పిలక దశలో అల్లం పంటను వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవచ్చ.

దిగుబడి :

ఎకరానికి 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను రూ.30 వేల వరకు పలుకుతోంది.

పాడి–పంట

అల్లంలో మారన్‌ విత్తనాలు మంచి దిగుబడిని ఇస్తాయి. దీనిని కేరళ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. మహావ రకం మహరాష్ట్రలో లభి స్తోంది.ఇవేకాక కేరళలో ఎర్నాడ్‌, వేనాడ్‌, కరు ప్పం పాడి, నడియా రకాలు ప్రసిద్ధిగాంచినవి.

పిలక దశలో మొదటి నాలుగు నెలలు యూరియా, 20:20 ఎరువులు రోజు మార్చి రోజు డ్రిప్‌ ద్వారా అందించాలి. దుంప ఎదుగుదల దశలో 13:0:45 ఎరువులను 3 నుంచి 5 నెలల వరకు ప్రతి నెల ఒకసారి ఇవ్వాలి. వీటితోపాటు మెగ్నీషియం సల్ఫేట్‌, కాల్షియం నైట్రేట్‌ ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement