నవాబుపేట: గతేడాది దాదాపుగా నెలరోజులపాటు దేవర గుట్టలో తిష్ట వేసిన చిరుత అప్పట్లో అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసిన వాటికి చిక్కకుండా తప్పించుకుని తిరిగింది. కాగా నెలరోజులు ఇక్కడే మకాం వేసిన చిరుత రోజూ సాయంత్రం జాగింగ్‌కు వచ్చినట్లు వచ్చి గుట్టలోని గుండ్లపై సేదతీరుతూ అందరికీ కనపడేలా కూర్చునేది. కాగా అప్పట్లో కనిపంచకుండా పోయిన చిరుత మరోసారి దర్శనం ఇచ్చింది. అదే దేవరగుట్టలో గుండ్లపై తీరుగుతూ శనివారం యన్మన్‌గండ్ల గ్రామస్తులను ఆందోళనకు గురి చేసింది. దర్జాగా గుండ్లపై గంతులు వేస్తూ చిరుత హల్‌చల్ చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. కాగా ఇప్పటికే ఒక లేగదూడ మృతి చెందితే చిరుత తీన్నదన్న అనుమానంతో అక్కడివారు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయిన అధికారు లు పట్టించుకోలేదు. తాజాగా చిరుతనే గుట్టపై కనిపించడంతో మరోసారి గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి చిరుతను బంధించి గ్రామస్తుల భయాందోళన తొలగించాల్సిన అవసరం ఉంది.
పిల్లిగుండు అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం
హన్వాడ: మండలంలోని పెద్దర్పల్లి, పల్లెమోనికాలనీ, పిల్లిగుండుతండా, కొత్తచెరువు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్దర్పల్లికి చెందిన వెంకటయ్యకు చెందిన ఆవుదూడపై దాడిచేసి చంపినట్లు పేర్కొంటున్నారు. అదే గ్రామానికి చెందిన రామయ్య పొలం వద్ద శనివారం ఉదయం ఆవుదూడ కళేబరం లభిచడం, పరిసర ప్రాంతాల్లో చిరుత జాడలు లభ్యమవడంపై పరిస ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆవుదూడపై శనివారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో చిరుత దాడి చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆయా గ్రామాల శివార్లలోని గిద్దెగట్టు, చీకర్లబండ, బండకుంట పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. మేకలు, గొర్రెలు, పశువుల కాప ర్లు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు గ్రామస్తులు సూచిస్తున్నారు.


