
విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి
ఖిల్లాఘనపురం: పంటకు కాపలా కాసేందుకు పొ లం వద్దకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. ఆలస్యంగా బుధవారం వెలుగు చూ సింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖిల్లాఘనపురం మండలంలోని రోడ్డుమీది తండాకు చెందిన సభావత్ భద్రునాయక్ (భద్యనాయక్) తాను సాగు చేసుకున్న వరిపంటను అడవి పందుల బెడద నుంచి కాపాడుకునేందుకు విద్యుత్ షాక్ పెట్టాడు. సోమవారం రాత్రి భోజనం తర్వాత కాపలాకు పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్ వైర్లు గమనించక ప్రమాదవశాత్తు తగలడంతో షాక్‌కు గరై అక్కడికక్కడే మృతిచెందాడు. మంగళవారం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఫోన్ చేశారు. ఫోన్‌రింగ్ అవుతున్నా.. ఎత్తడంలేదు. ఎక్కడో వెళ్లి ఉంటాడని అనుకున్నారు. మంగళవారం సాయంత్రం వరకు చూశా రు. ఎంతకూ రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా.. కరెంట్‌షాక్‌తో మృతిచెంది ఉన్నాడు. వెంటనే తండాకు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవా రం మృతు డి కూతు రు కాట్రావత్ గీత ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.
కోడేరు: విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘ టన మండలంలోని తీగలపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాచూరిస్వామి(45) తన పొలంలో మోటారు వేసేందుకు వెళ్లగా విద్యుత్‌షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. స్వామి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యు లు ఆందోళన చెంది పొలానికి వెళ్లి చూడ గా మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జగదీశ్వర్ తెలిపారు. మృతుడికి భార్య నాగమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లున్నారు.

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి