
మైనార్టీ గురుకులాల్లో సీఓఈ ప్రారంభం
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల–1లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సెంటర్ (సీఓఈ)ను గురు వారం అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి ద్యార్థులు పట్టుదలతో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా దేవరకద్ర మైనార్టీ బాలుర జూనియర్ కళాశాలలో సీఓఈను జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి శంకరాచారి, ఆర్‌ఎల్‌సీ ఖాజా బాహుద్దీన్ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు జమీర్‌ఖాన్, మసూద్, జహీర్, సలీం, బాలికల–1 కళాశాల ప్రిన్సిపాల్ హాజిరాబేగం, దేవరకద్ర బాలుర–2 కళాశాల ప్రిన్సిపాల్ రహెమతుల్లా తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ కళా భవనం సందర్శన
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్ ప్రాంగణంలో ఉర్దూ ఘర్ భవనం నిర్మించొద్దని కళా భవనం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు ఇచ్చారు. ఈ మేరకు గురువారం అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ అంబేడ్కర్ కళా భవన్‌ను సందర్శించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధుల సమక్షంలో అదనపు కలెక్టర్ విచారణ చేపట్టగా.. ఉర్దూ ఘర్ భవనం నిర్మించొద్దని దళిత సంఘాల ప్రతినిధులు తేల్చిచెప్పారు. ఆయన వెంట అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం, కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీసీఈఓ, ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జి ఈడీ వెంకట్‌రెడ్డి, శంకరాచారి, సునీత తదితరులున్నారు.