
బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): అదనపు కలెక్టర్‌గా మధుసూదన్‌నాయక్ గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏఓ సువర్ణరాజ్‌తోపాటు క లెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండలాల తహసీల్దార్లతో రెవెన్యూ సదస్సులు, భూ భారతి దరఖాస్తు లు, ఓటర్ జాబితా 2025లో నమోదు, చేర్పు లు, మార్పుల దరఖాస్తులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ భవనం లీకేజీ, మరమ్మతుకు అంచనాలు రూపొందించాలని ఆర్‌అండ్‌బీ ఏఈని ఆదేశించారు.
డీసీసీబీ సీఈఓ నియామకం నిలిపివేత
సాక్షి, నాగర్‌కర్నూల్/ మహబూబ్‌నగర్ (వ్యవసాయం): మహబూబ్‌నగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ సీఈఓ నియామకాన్ని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. సీఈఓ నియామకానికి అవసరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఆయన నియామకాన్ని నిరాకరించినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ డీసీసీబీ సీఈఓగా డి.పురుషోత్తమరావును ఈ ఏడాది జూలై 14న నియమించాలని కోరుతూ కమిటీ పంపిన ప్రతిపాదనను ఆర్బీఐ తిరస్కరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి స్పందిస్తూ సీఈఓ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను మాత్రమే ఆర్బీఐ తిరస్కరించిందని, నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొన్నారు.
హంస @ రూ.1,744
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం జరిగిన టెండర్లలో హంస ధాన్యం క్వింటాల్‌కు రూ.1,744 ఒకే ధర లభించింది. మార్కెట్‌కు వంద బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌కు రైతులు కత్తెర పంట కింద సాగు చేసిన వరి దిగుబడులను అమ్మకానికి తెస్తున్నారు.
టీఏలకు పే స్కేల్
అమలు చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు పే స్కేల్ అమలు చేయాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి.. నూతన కమిటీని ఎన్నుకున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా శివప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, కోశాధికారిగా రవీందర్, ఉపాధ్యక్షులుగా కరుణాసాగర్, ఈశ్వర్, హరిసింగ్, సుజాత, ఆంజనేయులు, కార్యదర్శులుగా లతకుమారి, కృష్ణ, ముఖ్య సలహాదారులుగా విజయ్‌భాస్కర్, విష్ణువర్ధన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సింహాచారి, ఆనంద్‌గౌడ్, మోసిన్, సుజన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ ఉపా ధి హామీ పథకంలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. డీఆర్‌డీఓ పరిధిలో ఒకే గొడుగు కింద పనిచేస్తున్న ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వం పే స్కేల్ ఇచ్చిందని, తమకు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. టీఏల సమస్యలు పరిష్కరించేందుకు తనవంతుగా కృషిచేస్తానన్నారు.