
యథావిధిగా సెర్చ్ ఆపరేషన్
● మరిన్ని చిరుతలు
ఉండొచ్చనే అనుమానం
● 16 ట్రాప్, 4 లైవ్ కెమెరాలతో
నిఘా, 3 బోన్ల ఏర్పాటు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కనిపించిందొకటి, బోనుకు చిక్కిందొకటి అనే అనుమానాలు స్థానిక ప్రజలను వెంటాడుతుండటంతో అటవీశాఖ చిరు త పులుల సంచారంపై మరింత అప్రమత్తమైంది. మహబూబ్‌నగర్ పట్టణ సమీపంలోని వీరన్నగట్టు, తిర్మల్‌దేవునిగుట్ట, డంపింగ్ యార్డు ప్రాంతాల్లో అటవీ సిబ్బందిని మూడు షిఫ్టులుగా విభజించి షిఫ్టుకు ఐదుగురు బృందంతో 24 గంటలు నిఘా ఉంచారు. రెండున్నర నెలలుగా పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుతపులి ఈనెల 15న వీరన్నపేట సమీపంలో తిర్మల్‌దేవుని గుట్ట వద్ద బోనుకు చిక్కింది. బోనుకు చిక్కిన చిరుతపులి రెండు సంవత్సరాల్లోపు వయసు కలిగినదిగా, ఆడ పులిగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలజికల్ పా ర్క్‌లో నిపుణులైన వెటర్నరీ డాక్టర్లు గుర్తించారు. అ యితే రెండున్నర నెలలుగా గుట్టపై ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో రికార్డయిన పులి పగ్ మార్కులను గుర్తించిన స్థానిక అటవీశాఖ అధికారులు మగ పులిగా, దాదాపు 3నుంచి 4ఏళ్లు కలిగినదిగా పేర్కొన్నారు. బోనుకు చిక్కిన చిరుత పులి, ట్రాప్ కెమెరాల్లో రికార్డయిన చిరుతపులికి వ్యత్యాసాలను అంచనా వేసిన స్థానికులు మరిన్ని చిరుతపులులు ఉండొచ్చనే భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు మరింత అప్రమత్తమై సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు.
సహకరించిన హమీద్‌కు సన్మానం,
నగదు బహుమతి
మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుత పులిని బోనుకు చిక్కేలా అటవీ సిబ్బందితోపాటు సహకరించిన వీరన్నపేటకు చెందిన హమీద్‌ను జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. మయూరి పార్కులో బుధవారం అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన స మావేశంలో హమీద్‌ను సన్మానించి రూ.5వేల నగదు బహుమతిని అందజేశారు. రెండున్నర నెలలుగా వీరన్నగట్టు, తిర్మల్‌దేవుని గుట్ట, డంపింగ్ యార్డు ప్రాంతాల్లో ఏర్పా టు చేసిన బోన్‌ల్లో మేకలను ఉంచడం, అటవీ సిబ్బందితోపా టు ఉన్నతాధికారులను గుట్టపైకి దారిచూపి తీసుకెళ్లడం, ఎప్పటికప్పుడు బోన్‌లపై ని ఘా పెట్టడం వంటి చర్యల్లో చురుకుగా పాల్గొన్నందు కు హమీద్ సేవలను గుర్తిస్తూ అటవీశాఖ సత్కరించింది.

యథావిధిగా సెర్చ్ ఆపరేషన్