
గర్భిణికి అరుదైన శస్త్రచికిత్స
● ప్రాణాపాయ స్థితి నుంచి
కాపాడిన వైద్యసిబ్బంది
● 12 రోజులుగా ప్రత్యేక గైనకాలజీ
విభాగంలో వైద్యచికిత్సలు
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రాణాపాయస్థితిలో ఉన్న గర్భిణికి జనరల్ ఆస్పత్రి గైనకాలజీ విభాగం వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాలు పాకాడడంతోపాటు సురక్షితంగా బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి కథనం ప్రకారం.. తాడూరు మండలం చర్ల తిరుమలాపూర్‌కు చెందిన గర్భిణి యాద మ్మ ఈనెల 6న తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మార స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తిరిగినా గర్భిణి పరిస్థితి గమనించి చికిత్స అందించకపోవడంతో కుటుంబ సభ్యులు జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. పల్స్, బీపీ పూర్తిగా పడిపోయిన స్థితిలో చేరిన గర్భిణి యాదమ్మను గైనకాలజిస్టులు పరీక్షించి హెటిరోటోపిక్ ప్రెగ్నెన్సీ గర్భధారణగా స్కానింగ్ చేసి నిర్ధారించారు. పిండం గర్భసంచి పక్కనున్న ట్యూబ్‌లో పెరగడం, అది పగిలిపోయి అధిక రక్తస్రావం జరిగినట్లు గుర్తించి వెంటనే గర్భిణి రక్తంలోకి 4 ఎర్ర రక్త కణాలు, 3 తెల్ల రక్త కణాలు ప్యాకెడ్ సేల్స్‌ను బ్లడ్‌బ్యాంక్ ద్వారా ఎక్కించి గైనకాలజీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ నీలిమ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేసి గర్భిణి ప్రాణా లు రక్షించారు. ఎటరోటోపిక్ ప్రెగ్నెన్సీ చాలా అరుదని, లక్షమంది గర్భిణుల్లో ఒకరికి సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. మరో రెండురోజుల తర్వా త గర్భసంచిలో ఉన్న పిండం కూడా గుండెచప్పుడు లేకపోవడంతో మ్యానువల్ వాక్యూమ్ ఆస్పిరేషన్ ద్వారా చికిత్స అందించినట్లు తెలిపారు. 12రోజులుగా యాదమ్మను ప్రత్యేక గైనకాలజీ విభాగంలో ఉంచి వైద్యచికిత్సలు అందించడంతోపాటు బుధవారం క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి అంబులెన్స్‌లో ఇంటికి పంపినట్లు తెలిపారు. ప్రాణాపా య స్థితిలో వచ్చిన గర్భిణికి మెరుగైన చికిత్స అందించిన వైద్యసిబ్బందిని సూపరింటెండెంట్ అభినందించా రు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ శేఖ ర్, సీ్త్ర వైద్య నిపుణులు నీలిమ, సుప్రియ, సౌమ్య, శిరీష, అనస్తీశియా బృందం ధీరజ్, గౌతం, సురేశ్, ఉదయ్, నర్సింగ్ ఆఫీసర్ జరీనా పాల్గొన్నారు.