
26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
మద్దూరు: మద్దూరు పట్టణంలో ఓషాపులో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి బియ్యాన్ని పట్టుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఆనంద్ కథనం ప్రకారం.. పట్టణంలోని ఎస్‌బీఐ దగ్గర ఉన్న దుకాణంలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు సమాచారం మేరకు నారాయణపేట, కోస్గి ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు కాళప్ప, భాస్కర్‌తో కలిసి తనిఖీలు నిర్వహించగా.. అక్కడ 58 బస్తాల బియ్యాన్ని గుర్తించారు. అలాగే రెండో ఆటోల్లో పీడీఎస్ బియ్యాన్ని అక్కడ అమ్మడానికి తీసుకొచ్చారు. ఒక ఆటోలో రెండు బస్తాలు, మరో ఆటోలో 6 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం 66 బస్తాల బియ్యాన్ని తూకం వేయగా.. 26 క్వింటాళ్లు వచ్చాయి. వీటిని ఖాజీపూర్ డీలర్ శ్రీలతకు అప్పగించి రషీద్ తీసుకున్నారు. దుకాణా యజమాని మహిమూద్, ఆటో డ్రైవర్లు గోవిందు, నరేశ్‌పై కేసు నమోదు చేసి ఆటోలను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు డీటీ పేర్కొన్నారు.