
చికెన్ కర్రీలో బల్లి కలకలం
నాగర్‌కర్నూల్ క్రైం: కస్టమర్లు ఆర్డర్ చేసిన చికె న్ కర్రీలో మృతిచెందిన బల్లి కనిపించిన ఘట న జిల్లాకేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలోని ఓ దాబాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దాబాలో చికెన్ కర్రీ, రైస్ ఆర్డర్ చేయడంతో దాబా సిబ్బంది కస్టమర్‌కు చికెన్ కర్రీ తీసుకొచ్చి ఇచ్చాడు. అందులో చనిపోయిన బల్లి కనబడడంతో భయాందోళనకు గురయ్యాడు. చికెన్ కర్రీలో చనిపోయిన బల్లి కస్టరమర్లకు ఇచ్చిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనకు సంబంధించి ఫుడ్ ఇన్స్‌పెక్టర్ నీలిమను వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేస్తామని తెలిపారు.
గంజాయి పట్టివేత:
ఇద్దరి రిమాండ్
జడ్చర్ల: స్కూటీలో గంజాయిని తరలిస్తుండగా ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టుకుని ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జడ్చర్ల ఎకై ్సజ్ ఎస్‌ఐ కార్తీక్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి జడ్చర్ల కొత్తబస్టాండ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా స్కూటీపై వస్తున్న ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయ గా స్కూటీ డిక్కీలో 310గ్రాముల ఎండు గంజాయి బయటపడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరిని జడ్చర్ల కుమ్మరివాడకు చెందిన కుమార్ అలియాస్ మింటుగా గుర్తించగా.. మరొకరు బీహార్‌కు చెందిన బిజేశ్‌కుమార్‌గా గుర్తించారు. వీరు హైదరాబాద్‌లో రూ.15వేల కు ఆరకిలో గంజాయిని కొనుగోలు చేసి 10 గ్రాముల ప్యాకెట్ చొప్పున తయారు చేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.600కు విక్రయిస్తున్నా రు. స్కూటీతోపాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బుధవారం నిందితులను రిమాండ్‌కు తరలించారు. తనిఖీలో సిబ్బంది అనిల్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
యువతి ఆత్మహత్య
కేటీదొడ్డి: ఉరేసుకుని యు వతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఉ మిత్యాలతండాలో చోటు చోటుచేసుకుంది. స్థానికు ల కథనం ప్రకారం.. తండాకు చెందిన ఈరమ్మ (19) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. యువతికి మద్దెలబండతండాకు చెందిన ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. తరచూ ఫోన్‌లో మాట్లాడేదన్నారు. తల్లి దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
రాజాపూర్(బాలానగర్): బాలానగర్ మండలం మోతీఘణపూర్ శివారు లో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్‌ఐ లెనిన్‌గౌడ్ తెలిపారు. మోతీఘణపూర్ శివారులో సీఎస్‌కే వెంచర్‌లో 45 సంవత్సరాల వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు చూసి సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. మృడుడి ఒంటిపై బ్లూ షార్ట్, తెల్లషర్టుపై గీతలున్నట్లు మృతుడి జేబులో గార్డ్ శ్యామ్‌శర్మ ఐడీ నెంబర్ 00689 ఐడీకార్డు ఉన్నట్లు తెలిపారు. మోతీఘణపూర్ పంచాయతీ కార్యదర్శి వడ్ల నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అచ్చంపేట రూరల్: పట్టణంలోని టంగాపూర్ శివారులో ఓ వెంచర్‌లో తాను కొనుగోలు చేసిన ప్లాట్‌లో ఇంటి నిర్మాణం చేయగా.. కొందరు ఆక్రమణదారులు కూల్చివేశారని మనస్తాపం చెందిన పుల్యనాయక్ అనే వ్యక్తి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని సర్వే నెంబర్ 26, 27లో కొన్నేళ్ల కిందట ప్లాట్లను కొనుగోలు చేశాడు. మున్సిపల్ అధికారుల నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నప్పటికీ కొందరు ఆక్రమణదారులు తమ ప్లాట్లను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. బుధవారం జేసీబీ సహాయంతో నిర్మాణ దశలో ఉన్న గోడలు, రేకులు తొలగించడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. గమనించిన సమీప ఇళ్లవారు అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు.

చికెన్ కర్రీలో బల్లి కలకలం

చికెన్ కర్రీలో బల్లి కలకలం

చికెన్ కర్రీలో బల్లి కలకలం