
జ్వరం వచ్చిందని వస్తే..
కుక్కకాటు ఇంజెక్షన్ ఇచ్చారు
దేవరకద్ర: జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అక్కడ పరీక్షించి న వైద్యుడు చీటీ రాసివ్వగా.. దానిని నర్సుకు చూ పించడంతో ఆమె నిర్లక్ష్యంగా కుక్కకాటు ఇంజక్షన్ ఇచ్చిన సంఘటన మ హబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర పీహెచ్‌సీలో చో టుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో ని బల్సుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు వైర ల్ జ్వరంతో బాధపడుతూ సోమవారం దేవరకద్ర పీహెచ్‌సీకి వచ్చాడు. అయితే మూడు రోజుల పాటు ఐవీ పెట్టాలని, అందులో ఇంజక్షన్ ఇ వ్వాలని సూచిస్తూ వైద్యాధికారి శరత్‌చంద్ర ప్రిస్కిప్షన్ ఇవ్వగా.. సైలెన్ పెట్టి ఇంజెక్షన్ చేశా రు. మంగళవారం అదే చీటీని తీసుకువచ్చి వై ద్యాధికారికి చూపించగా మళ్లీ ఐవీ పెట్టాలని సూచించారు. అయితే ఆస్పత్రిలో ఉన్న ఏఎన్‌ఎం విజయకుమారి వద్దకు వెళ్లిన నాగరాజు చీటీ చూపించగా వరుసగా తేదీలు ఉండడంతో కుక్కకాటు ఇంజెక్షన్ ఇవ్వాలని అనుకున్న నర్సు యాంటీ రేబిస్ టీకా చేసింది. ఐవీలో ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఇలా చేతికి ఇవ్వడంతో బాధితుడు నాగరాజు నర్సును అడిగాడు. కుక్కకాటు ఇంజక్షన్ ఇచ్చినట్లు నర్సు చెప్పడంతో ఆందోళనకు గురైన బాధితుడు విషయం వైద్యాధికారి శరత్‌కు చెప్పగా.. నర్సుపై చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. కాగా.. కొందరు ఇంట్లోకు క్కలను పెంచుకునే వారు ముందస్తుగా యాంటీ రేబిస్ టీకాలు తీసుకుంటారని, దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యాధికారి చెప్పారు. అయితే నాగరాజును మాత్రం అబ్జర్వేషన్‌లో ఉంచుతామని తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి నాగరాజుకు వైద్య పరీక్షలు చేసి జ్వరానికి సంబంధించిన ఇంజక్షన్ ఇచ్చారు.
వ్యక్తి ఆత్మహత్య
వెల్దండ: మండలంలోని బొల్లంపల్లికి చెందిన కానుగుల జంగయ్య(45) బుధవారం వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. జంగయ్య వెల్దండలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం షాపు వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వ్యవసాయ పొలంలో సాయంత్రం 6గంటలకు బైక్ ఉండడంతో పరిసరాల్లో వెతకగా.. చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. మృతిగల కారణాలు తెలియరాలేదు. మృతుడికి భార్య రజితతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అడవిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
మహబూబ్‌నగర్ క్రైం: దాదాపు పదిరోజుల కిందట చెట్టుకు ఉరేసుకొన్న ఓ గుర్తు తెలియని వ్య క్తి మృతదేహం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి అడవిలో గుర్తు తెలియని వ్యక్తి(35) దాదాపు పదిరోజుల కిందట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. బుధవారం మేకల కాపరి సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహం పరిశీలించగా.. పూర్తి గా గుర్తించలేని విధంగా కుల్లిపోయింది. మృతదేహం జనరల్ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
యాచకుడి హత్య కేసులో నేరస్తుడికి జీవిత ఖైదు
మహబూబ్‌నగర్ క్రైం: యాచకుడిని రాళ్లతో దాడిచేసి హత్య చేసిన కేసులో నేరస్తుడికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 ఏప్రిల్ 18న స్థానిక బస్టాండ్ వద్ద ఆర్‌వోబీ బ్రిడ్జి కింద ఉంటూ బిక్షాటన చేసే మరికల్‌కు చెందిన సీమ వెంకటయ్యను రాళ్లతో దాడిచేసి హత్య చేశారు. ఈ కేసు బుధవారం అదనపు సెషన్స్ కోర్టు–ఎస్సీ, ఎస్టీ కోర్టుకు రావడంతో వాదనలు విన్న తర్వా త నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శారదాదేవి నిందితుడు వెంకటేశ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసు దర్యాప్తు, విచారణలో కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, అదనపు పీపీని ఎస్పీ జానకి అభినందించారు.