
ఉపాధ్యాయ సర్వీస్ బుక్స్ పరిశీలన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా శనివారం సీనియార్టీ లిస్టును ప్రదర్శించిన విద్యాశాఖ అధికారులు ఆదివారం సర్వీస్ బుక్కుల పరిశీలనతోపాటు సీనియార్టీ లిస్టుపై అభ్యంతరాలను సైతం స్వీకరించారు. జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి పరిశీలన జరిగింది. ప్రమోషన్లలో మొత్తం 150 ఖాళీలు ఉండగా అందులో 1:3 రేషియో ప్రకా రం 450 మందికి గాను 440 మంది సర్వీస్ బుక్కులను పరిశీలన చేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని డీఈఓ ప్రవీణ్‌కుమార్, సూపరింటెండెంట్ శంభుప్రసాద్ పర్యవేక్షించారు.