అసౌకర్యాల ప్రాంగణాలు | - | Sakshi
Sakshi News home page

అసౌకర్యాల ప్రాంగణాలు

Aug 4 2025 4:20 AM | Updated on Aug 4 2025 4:20 AM

అసౌకర

అసౌకర్యాల ప్రాంగణాలు

జిల్లాలో నిరుపయోగంగా గ్రామీణ క్రీడా మైదానాలు

బోర్డులు ఏర్పాటు చేసి..

కంచె నిర్మించి వదిలేసిన వైనం

ఊరికి దూరంగా నిర్మించడంతో ఆసక్తి చూపని క్రీడాకారులు

నిర్వహణ లేక వర్షపు నీరు నిలిచి.. చెట్లు, ముళ్లపొదలతో దర్శనం

రూ.కోట్లలో ప్రజాధనం వృథా.. పట్టించుకోని అధికార యంత్రాంగం

గ్రామీణ క్రీడా మైదానాలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం నుంచి నిధులు ఖర్చు పెట్టడానికి అవకాశం కల్పించారు. అప్పట్లో ఈ మైదానం నిర్వహణకు ఒకరిని నియమించి క్రీడా ప్రాంగణం చుట్టూ 300 మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించారు. వీటిని సంరక్షించేందుకు ఓ ఉద్యోగిని ఏర్పాటు చేసి ఉపాధి పథకం ద్వారా వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, ప్రాంగణాలకు ఉద్యోగిని నియమించకపోవడంతోపాటు అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథా అవుతోంది. దీంతో క్రీడాకారులకు ఆట స్థలాలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. ఉపాధి హామీ పథకం కింద రూ.లక్షలు వెచ్చించి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. అయితే వాటిలో సరైన వసతులు కల్పించకపోవడంతో పిచ్చిమొక్కలు మొలిచి.. వర్షపు నీరు నిలిచి ఎందుకూ పనికి రాకుండాపోయాయి. మరికొన్ని మైదానాలు ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. దీంతో ఆయా క్రీడా ప్రాంగణాలు వృథాగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

జిల్లాకు 389 మంజూరు..

జిల్లాలో మొత్తం 16 మండలాలు ఉండగా.. 423 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే వీటికి గాను 389 క్రీడా ప్రాంగణాలు జిల్లాకు మంజూరయ్యాయి. ఇందుకోసం ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.3,89,81,000లు మంజూరు చేశారు. ఆయా క్రీడా ప్రాంగణాల్లో ఖోఖో బార్లు, వాలీబాల్‌ పోల్స్‌ ఏర్పాటు చేశారు. అలాగే బోర్డులు ఏర్పాటు చేసి.. చుట్టూ ఇనుప తీగలతో కంచె నిర్మించారు. కానీ, మిగతా ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం, నిర్వహణ కూడా లేకపోవడంతో నిరుపయోగంగా మారి.. రూ.కోట్లలో ప్రజాధనం వృథా అయ్యాయి.

నిర్వాహకులు లేక..

అసౌకర్యాల ప్రాంగణాలు1
1/3

అసౌకర్యాల ప్రాంగణాలు

అసౌకర్యాల ప్రాంగణాలు2
2/3

అసౌకర్యాల ప్రాంగణాలు

అసౌకర్యాల ప్రాంగణాలు3
3/3

అసౌకర్యాల ప్రాంగణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement