కలగానే ‘నవోదయం’ | - | Sakshi
Sakshi News home page

కలగానే ‘నవోదయం’

Aug 4 2025 3:21 AM | Updated on Aug 4 2025 3:21 AM

కలగాన

కలగానే ‘నవోదయం’

గండేడ్‌: గండేడ్‌ మండలంలో జవహార్‌ నవోదయ పాఠశాల ఏర్పాటుపై సంశయం వీడడం లేదు. ఆరు నెలలుగా అధికారులు స్థలం ఎంపికలో మల్లగుల్లాలు పడుతున్నారు. చివరకు స్థలం ఎంపిక చేసినా కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో మీమాంస నెలకొంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గండేడ్‌ మండలానికి జవహార్‌ నవోదయ పాఠశాల మంజూరైనట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఈ ఏడాది జనవరిలో ఓ సమావేశంలో ప్రకటించారు. గండేడ్‌ మండలంలో 27 జీపీలతోపాటు 13 తండాలు ఉన్నాయి. 36,328 మంది జనాభా కలిగిన ఈ మండలంలో విద్యాచైతన్యం ఎక్కువగా ఉంది. జిల్లాలోనే ఈ మండలంలో ఉపాధ్యాయులతోపాటు ఇతర ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే. జిల్లాలో ఉన్న ఏకై క మోడల్‌ స్కూల్‌ కూడా గండేడ్‌ మండలంలోని వెన్నాచేడ్‌లో ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మరో విద్యా మణిహారాన్ని గండేడ్‌ సిగలో చేర్చడానికి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి గట్టిగా కృషిచేశారు. నవోదయ పాఠశాల గండేడ్‌కు మంజూరైనట్లు తెలిపారు. దీంతో అధికారులు స్థలం ఎంపిక ప్రక్రియ చేపట్టారు.

సల్కర్‌పేట్‌లో ఏర్పాటుకు ఫైనల్‌

సల్కర్‌పేట్‌ శివారులో అంతర్‌గంగ లింగేశ్వరస్వామి ఆలయం వెనక ఉన్న భూములను కూడా పరిశీలించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి వట్టెం నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్‌ భాస్కర్‌కుమార్‌తో కలిసి స్వయంగా పరిశీలించారు. 58 సర్వేనెంబరులో 25ఎకరాలకుపైగా భూమి ఉన్నట్లు డీటీ మాధవి చూయించారు. రైతులు, ఇతరుల నుంచి ఎలాంటి సమస్య లేదని కాంగ్రెస పార్టీ మండలాధ్యక్షుడు జితేందర్‌రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రిన్సిపాల్‌ భాస్కర్‌కుమార్‌ కూడా పాఠశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని సుముఖత వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఈ స్థలాన్నే ఫైనల్‌ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ విషయమై కలెక్టర్‌ విజయేందిరబోయితో మాట్లాడారు. అన్నిరకాలుగా స్థలం అనుకూలంగా ఉందని స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా కోరారు. దీంతో రెండు మూడుసార్లు సర్వే చేయించి నివేదికను ఉన్నతాఽధికారులకు పంపారు. దీన్ని జవహార్‌ నవోదయ వారి అనుమతి కోసం కేంద్రానికి నివేదించారు. కాని ఇప్పటివరకు ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్‌ రాలేదు. దీంతో గండేడ్‌ మండలానికి ఈ పాఠశాల వస్తుందో రాదోనని కొందరు సంశయం వ్యక్తం చేస్తున్నారు. అటు మహబూబ్‌నగర్‌లో కూడా తాత్కాలిక వసతిలో పాఠశాల ప్రారంభం కాకపోవడంతో అక్కడ స్థలం కూడా లేకపోవడంతో గండేడ్‌కే నవోదయ పాఠశాల వస్తుందని మరికొందరు గట్టిగా నమ్ముతున్నారు. ఏదీఏమైనా నవోదయ పాఠశాల గండేడ్‌ మండలంలో ఏర్పాటైతే పేద విద్యార్థులకు మరింత మేలు చేకూరనుంది.

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

నవోదయ పాఠశాల గండేడ్‌కు మంజూరైందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చెప్పడంతో సంతోషించాం. స్థలం కోసం నాలుగైదు గ్రామాల్లో వెతికాం. వివిధ కారణాలతో అవి వద్దని జవహార్‌ నవోదయ అధికారులు చెప్పారు. చివరకు సల్కర్‌పేట్‌ శివారులో భూమి ఉన్నట్లు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారొచ్చి పరిశీలించి సర్వేలు చేయించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. – జితేందర్‌రెడ్డి,

మండల కాంగ్రెస్‌ పార్టీ, గండేడ్‌

ముఖ్యమంత్రి మాటిచ్చారు..

నవోదయ పాఠశాలను గండేడ్‌లో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటిచ్చారు. దీంతో స్థలాన్ని ఎంపిక చేసి సర్వేలు కూడా చేయించాం. దీనినే ఫైనల్‌ చేయాలని, అదే నివేదికను జవహార్‌ నవోదయ అధికారులకు పంపాలని కోరాం. కచ్చితంగా సల్కర్‌పేట్‌లోనే నవోదయం పాఠశాల ఏర్పాటవుతుంది. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పాఠశాల ఏర్పాటు పనులు ప్రారంభిస్తారు.

– రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి

తాత్కాలికంగా ఎక్కడా కాలేదు

గండేడ్‌ మండలానికి నవోదయ పాఠశాల మంజూరైనట్లు చెప్పారు. దీంతో పలుచోట్ల స్థలాల పరిశీలన జరిగింది. చివరికి సల్కర్‌పేట్‌ శివారులో పాఠశాల ఏర్పాటుకు స్థలం అనుకూలంగా ఉంది. ఈ విషయాన్ని నవోదయ అధికారులకు నివేదించాం. అక్కడి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. మహబూబ్‌నగర్‌లో తాతాల్కిక వసతితో నవోదయ పాఠశాల ప్రారంభం కాలేదు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. – భాస్కర్‌కుమార్‌,

ప్రిన్సిపాల్‌, వట్టెం నవోదయ పాఠశాల

ముందుగా జంగంరెడ్డిపల్లి ప్రస్థావన

నవోదయ పాఠశాల ఏర్పాటుకు 25 ఎకరాల స్థలం అవసరం కావడంతో జిల్లా అధికారులు దానిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ముందుగా మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న జంగంరెడ్డిపలిలో ప్రభుత్వ స్థలం ఉందన్న సమాచారం మేరకు అధికారులు పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, ఆర్డీఓ రెండుసార్లు గ్రామ సమీపంలో ఉన్న భూములను పరిశీలించారు. అయితే అటవీప్రాంతంతోపాటు పట్టా భూములు కూడా ఉన్నాయి. ఇది నవోదయ నిబంధనలకు అనుకూలంగా లేకపోవడంతో దానిని పక్కనపెట్టారు. అదే సమయంలో నవోదయ పాఠశాల మహబూబ్‌నగర్‌కు కేటాయిస్తున్నారని తాత్కాలిక వసతి కోసం అన్వేషిస్తున్నారని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఏమైందో తిరిగి గండేడ్‌లో పాఠశాల ఏర్పాటు చేస్తారని చెప్పడంతో చిన్నవార్వాల్‌, పెద్దవార్వాల్‌ మధ్యలో మరో స్థలాన్ని పరిశీలించారు. దీనికి ఆనుకొని చెరువు ఉండడంతో అది కూడా తిరస్కరించారు.

గండేడ్‌లో విద్యా మణిహారం ఏర్పాటుపై మల్లగుల్లాలు

ఆరునెలలుగా స్థల పరిశీలన.. చివరికి సల్కర్‌పేటలో ఎంపిక

కేంద్రానికి నివేదిక పంపిన అధికారులు

పైనుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో వీడని సందిగ్ధం

కలగానే ‘నవోదయం’ 1
1/2

కలగానే ‘నవోదయం’

కలగానే ‘నవోదయం’ 2
2/2

కలగానే ‘నవోదయం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement