
కళలనుప్రోత్సహించడం హర్షణీయం
పిల్లలకు చదువుతోపా టు వివిధ కలలను నేర్పి ంచడం ఎంతో హర్షనీయం. చిన్నతనం నుంచి సంగీతం నేర్చుకోవడం వల్ల దేశ సంస్కృతి, సాంప్రదాయాలు తెలుస్తాయి. సంగీతం వల్ల మనస్సు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కళల్లో ప్రావిణ్యం సంపాదిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. బాల కేంద్రానికి పరిమితమైన సంగీత శిక్షణ పాఠశాలకు విస్తరించడం స్వాగతిస్తున్నాం.
– మహిపాల్‌రెడ్డి, ఎస్పీ బాలు ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రతిభను వెలికితీసేలా..
ప్రభుత్వ బడుల్లో విద్యతోపాటు సంగీత తరగతుల నిర్వహణతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోధనతో అలసటకు గురయ్యే పిల్లలు సంగీతంతో మరింత ఉత్సాహంగా ఉంటుంది. ప్రస్తుతం అనేక పాఠశాలలో టీచర్లు పాటాలను కథలు, గేయాల రూపంలో చెబుతూ విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారు. సంగీత తరగతులు సత్ఫలితాలిస్తాయి. – అన్నపూర్ణ,
జీహెచ్‌ఎం, కానుకుర్తి, నారాయణపేట
సంగీత పరికరాలు వచ్చాయి
పీఎంశ్రీ పథకంలో జిల్లా లోని ఎంపిక చేయబడ్డ పాఠశాలలకు మొదటి విడత కింద సంగీత పరికరాలను పంపిణీ చేశారు. దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నాం. 6నుంచి 12వ తరగతి విద్యార్థులకు వారానికి ఒక్కో పీరియడ్ సంగీతం, వాయిద్యాలపై శిక్షణ ఇచ్చేందుకు టైం టేబుల్ ఏర్పాటు చేస్తున్నాం. కాంట్రాక్ట్ పద్ధతిలో శిక్షకుల నియామకానికి సూచనలు చేశాం.
– గోవిందరాజు, డీఈఓ, నారాయణపేట

కళలనుప్రోత్సహించడం హర్షణీయం

కళలనుప్రోత్సహించడం హర్షణీయం