
మహబూబ్‌నగర్
భక్తిశ్రద్ధలతో నాగ పంచమి
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025
నాగుల పంచమి వేడుకలను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉపవాసాలు పాటించిన వారు నాగులకు నైవేద్యాలు సమర్పించి దీక్షను విరమించారు. జిల్లాకేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం కిటకిటలాడింది. నాగులకు పాలు, పండ్లు, నువ్వుల ఉండలు, పేలాలు నివేదించారు. వీరన్నపేట రామలింగేశ్వర స్వామి దేవాలయం(పాత శివాలయం), పిల్లలమర్రి రోడ్డులోని వేంకటేశ్వర స్వామి, టీచర్స్ కాలనీ రామాలయం, శ్రీనివాస కాలనీ పంచముఖాంజనేయ స్వామి ప్రాంగణంలోని నాగుల పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
– స్టేషన్ మహబూబ్‌నగర్