
మహబూబ్‌నగర్ విజయం
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లో జరిగిన హెచ్‌సీఏ బి–డివిజన్ టూ డే లీగ్ చాంపియన్‌షిప్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు విజయం సాధించింది. జిల్లా జట్టు 161 పరుగుల తేడాతో వెస్ట్‌మారేడ్‌పల్లిపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 85.1 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌట్ అయింది. బుధవారం రెండో రోజు బ్యాటింగ్ చేసిన వెస్ట్‌మారేడుపల్లి 56.4 ఓవర్లలో 139 పరుగులకు కుప్పకూలింగింది. మహబూబ్‌నగర్ బౌలర్ ముఖితుద్దీన్ 17.4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లు జస్వంత్ 3, జయసింహ 1 వికెట్ తీశారు. విజయం సాధించిన జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అభినందించారు.
161 పరుగుల తేడాతో వెస్ట్‌మారేడ్‌పల్లిపై గెలుపు
హెచ్‌సీఏ బీ–డివిజన్ టూ డే లీగ్

మహబూబ్‌నగర్ విజయం