Telangana Crime News: 'చనిపోకముందే.. చనిపోయిందని చప్పడంతో'.. ప్రేమికులిద్దరూ తీవ్ర నిర్ణయం..!
Sakshi News home page

'చనిపోకముందే.. చనిపోయిందని చప్పడంతో'.. ప్రేమికులిద్దరూ తీవ్ర నిర్ణయం..!

Aug 28 2023 12:56 AM | Updated on Aug 28 2023 9:24 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: మండలంలోని మిరాసిపల్లికి చెందిన స్వాతి(15) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌ మండలం మోట్లంపల్లికి చెందిన మహేష్‌(19), స్వాతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో స్వాతి కుటుంబ సభ్యులు మహేష్‌కు ఫోన్‌ చేసి స్వాతి చనిపోకముందే చనిపోయిందని, మా అమ్మాయి చావుకు నీవే కారణం నిన్ను, నీ కుటుంబ సభ్యులను చంపుతామని చెదిరించారు.

దీంతో మహేష్‌ తన తండ్రికి విషయాన్ని చెప్పడంతో మాట్లాడుదాము నీవేమి బెంగపెట్టుకోవద్దని సర్దిచెప్పాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మహేష్‌ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మహేష్‌ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న స్వాతి ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్వాతి తండ్రి కుర్మయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా స్వాతి స్థానిక జెడ్పీహెచ్‌లో 10వ తరగతి చదువుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement