నాకు రెండు కాళ్లు పడిపోయాయి. భార్య శ్రావణి పేరున డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేయగా మంజూరు చేశారు. అయితే దానిని ఎల్2లో పెండింగ్‌లో పెట్టారు. ఇటీవల చాలా మంది లబ్ధిదారులకు మంజూరు చేశారు. నా పేరు లేదు. ఇప్పటికై న డబుల్ ఇల్లు మంజూరు చేయాలి. – గణేష్, దివ్యాంగుడు, తొర్రూర్
స్థలం కేటాయించాలి
పందులను పట్టణం నుంచి తరలించాలని అధికారులు ఆదేశించారు. కాని స్థలం కేటాయించలేదు. స్థలం కేటాయిస్తే దానిలో షెడ్లు ఏర్పాటు చేసుకుంటాం. పట్టణంలోకి పందులను రానివ్వం. – పందుల పెంపకందారులు వి.ఉప్పలయ్య,
గోపి, శాంతయ్య, వెంకటేశ్వర్లు


