పురుషులకంటే మహిళల్లో ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతుంటారు. ప్రధానంగా 16 నుంచి 25 సంవత్సరాల వయస్సు వారిలో నేనే గొప్ప.. అన్ని నాకే కావాలి.. నేను కోరుకున్నది నాకే దక్కాలి అనే ఆలోచనతో ఉంటారు. ఏమాత్రం అనుకున్నది అందకపోయినా.. ఆత్మహత్యలకు పాల్పడేందుకు సిద్ధమవుతారు. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన గమనించాలి. పిల్లలకు సమయం ఇవ్వాలి. వారితో మాట్లాడాలి. ఇబ్బందులు పడుతున్నప్పుడు నేనున్నాననే భరోసా ఇవ్వాగలగాలి. అవసరాన్ని బట్టి సైక్రియాట్రిస్ట్‌కు చూపించి సలహాలు తీసుకోవాలి.
– బండి రాధిక, సైక్రియాట్రిక్ట్, హెచ్‌ఓడీ, ప్రభుత్వ వైద్య కళాశాల


