కొనసాగుతున్న వైద్యుల నిరసన | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వైద్యుల నిరసన

Oct 14 2026 4:05 AM | Updated on Oct 14 2026 4:05 AM

నెహ్రూసెంటర్‌: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంటర్న్‌ డాక్టర్లు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. ఆరోరోజు మంగళవారం జీజీ హెచ్‌లో వైద్య సేవలు నిలిపివేసి ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటర్న్‌ డాక్టర్లు మాట్లాడుతూ.. ఐఎంజీ, ఎఫ్‌ఎంజీ వైద్యులకు చెల్లించే వేతనాలు, స్టైఫండ్‌లో తేడాలు లేకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హౌజ్‌ సర్జన్లుగా, అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని సుప్రీంకోర్టు ఆర్డర్‌ ప్రకారం సమాన వేతనం చెల్లించాలని కోరారు. ఇంటర్న్‌ డాక్టర్లు చేపట్టిన నిరసనకు కార్మిక, పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్న్‌ డాక్టర్స్‌, పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement