పాత పత్తికి అధిక ధర | - | Sakshi
Sakshi News home page

పాత పత్తికి అధిక ధర

Oct 14 2026 4:05 AM | Updated on Oct 14 2026 4:05 AM

● నేటి నుంచి కొత్త పత్తి కొనుగోళ్లు

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పాతపత్తికి అధిక ధర పలికింది. ఓ రైతు మూడు బస్తాల పత్తిని విక్రయించేందుకు తీసుకురాగా.. గరిష్ట ధర క్వింటాకు రూ.8,818 పలుకగా హర్షం వ్యక్తం చేశాడు. రైతులు ఇటీవలికాలంలో పాత పత్తిని విక్రయించేందుకు తీసుకువస్తుండగా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకన్నా అధిక రేట్‌ పలుకుతోంది.

నేటి నుంచి షురూ..

మహబూబాబాద్‌ మార్కెట్‌ యార్డులో కొత్త పత్తి కొనుగోళ్లు (నేడు) ప్రారంభిస్తున్నామని మార్కెట్‌ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌, సెక్రటరీ వేముల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రైవేట్‌ వ్యాపారులు కొత్త పత్తి కొనుగోలు చేస్తారని, రైతులు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మంచి ధర పొందాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement