చేపల చెరువుకు.. సీసీ నిఘా | - | Sakshi
Sakshi News home page

చేపల చెరువుకు.. సీసీ నిఘా

Oct 14 2026 4:05 AM | Updated on Oct 14 2026 4:05 AM

కేసముద్రం: చేపల దొంగతనాలను అరికట్టేందుకు మత్స్యకారులు చెరువు వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మండలంలోని బేరువాడ గ్రామం నుంచి పెనుగొండకు వెళ్లే దారిలో నర్సింహులగూడెం గ్రామానికి చెందిన పాతర్ల కుంట చెరువు ఉంది. ఆ చెరువులో మత్స్యకారులు ప్రతీఏటా మాదిరిగా చేపలు పెంచుతున్నారు. అయితే చెరువులోని చేపలు దొంగతనం జరగకుండా మత్స్యకారులకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే చెరువు ఒడ్డున కర్రలు ఏర్పాటు చేసి, చివరన సోలార్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దొంగతనాలను నివారించేందుకు వారికి వచ్చిన ఆలోచనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement