● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని, జిల్లాలో పండుగ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సంబంఽధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ ఆడే ప్రదేశాలు, చెరువులు, కుంటలు దేవాలయాలు తదితర ప్రదేశాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో తగు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, డీఆర్వో నాగలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


