సమ్మెలో పాల్గొన్న ఎన్హెచ్ఎం ఉద్యోగులు
నెహ్రూసెంటర్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)పరిధిలో పని చేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్హెచ్ఓం ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. జిల్లాలో ఎన్హెచ్ఎం పరిధిలో 441మంది డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఎల్టీలు, స్టాఫ్న ర్సులు, టెక్నీషియన్లు, ఫార్మసిస్టులతో పాటు ఇతర వైద్య విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. 20 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తూ చాలిచాలనీ వేతనాలతో, సమస్యలపై పోరాడుతూ పని చేస్తున్నామని, కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందించామని పేర్కొన్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకుండా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నా యని ఉద్యోగులు చెబుతున్నారు.
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి..
ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎన్హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఉమాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఎన్హెచ్ఎం ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఉమాకర్ మాట్లాడుతూ.. సమా న పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, ప్రసూ తి సెలవులు, హెల్త్సొసైటీ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి వైద్యశాఖలో పనిచేస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడంలో ముందు వరుసలో ఉన్నామని పేర్కొన్నా రు. ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయడం లేద ని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, రాజ్కుమార్, ప్రియాంక, వసుమతి, నీలిమా, స్వర్ణ, శిరీష, వాణి, నవీన్, శివకుమార్, ఝాన్సీ, నర్మద, సబితా, త్రివేణి, రూప, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకు సమ్మెకు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.అజయ్సారథిరెడ్డి, రేషపల్లి నవీన్ హాజరై మద్దతు తెలిపారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగులకు కేడర్ ఫిక్సేషన్ అమలు చేయాలి.
వందశాతం బేసిక్ శాలరీ చెల్లించాలి.
ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి రాష్ట్ర హెల్త్ సొసైటీ ద్వారా వేతనాలు నేరుగా చెల్లించాలి.
ఎన్హెచ్ఎం ఉద్యోగికి సంవత్సరానికి 5శాతం ఇంక్రిమెంట్ బోనస్ కల్పించాలి.
మహిళా ఉద్యోగులకు 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి.
ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా, భరోసా కల్పించాలి.
ఉద్యోగ భద్రతతతో పాటు పీఆర్సీ ప్రయోజనాలు కల్పించాలి.
డిమాండ్లు నెరవేర్చాలని ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె
జిల్లాలో 441 మంది సిబ్బంది


