విద్యుత్‌ కోతలపై సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోతలపై సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

నర్సింహులపేట: ప్రభుత్వం రైతుల పంటలకు విద్యుత్‌ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని, విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దనాగారం సబ్‌స్టేషన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయానికి సమయానికి అనుకూలంగా విద్యుత్‌ అందించలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ఉందని విమర్శించారు. నీటి వసతి ఉన్నా.. కరెంట్‌ లేక పంటలు ఎండుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు రవీందర్‌రెడ్డి, వీరస్వామి, వంశీ, పుల్లయ్య, దామోదర్‌, కిషన్‌, లింగయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement