గార్ల: జిల్లాలో క్షయ (టీబీ) రహిత గ్రామ పంచాయతీగా మండలంలోని మద్దివంచ గ్రామ పంచాయతీ ఎంపికై ంది. రెండేళ్లలో పంచాయతీలో ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాకపోవడంతో మద్దివంచ సర్పంచ్ గూగులోత్ ప్రమీల టీబీ ముక్త్ జాతీయ పురస్కారాన్ని శుక్రవారం కలెక్టరేట్‌లో అందుకున్నారు. తొలుత జిల్లా అధికారులు సర్పంచ్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ అర్జున్, గార్ల ఎంపీడీఓ మంద మంగమ్మ, ఎంఈఓ శ్రీలక్ష్మి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరం
మహబూబాబాద్ అర్బన్: విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరమని జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు దేశీరామ్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధి, విద్యాప్రగతి కేవలం ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రుల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లడం, ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యసన, అక్కడి వసతులు, తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏటీడీఓ ఉపేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూక్య బాబు, వార్డెన్ అనిత, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి
మహబూబాబాద్ అర్బన్: రాబోయే వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీచర్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో పట్టభద్రులను గుర్తించి ప్రతీఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని, ఇందుకు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహేశ్‌గౌడ్, అశోక్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు రామచంద్రరావు, శ్యాం సుందర్‌శర్మ, ఎన్నికల కన్వీనర్ సింగరం సతీష్, పల్లె సందీప్, నాయకులు పూర్ణచందర్, సురేష్, నరేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌జెండర్ల రక్షణకు
ప్రత్యేక చర్యలు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీఎస్పీ (అడ్మిన్) గండ్రతి మోహన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీసీఎస్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించి, అవసరమైన పోలీస్ సహాయం, చట్టపరమైన రక్షణ అందించాలనే ఉద్దేశంతో మహిళా పోలీస్‌స్టేషన్ పరిధిలో జిల్లా ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. వారు ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులు, ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ సెల్ పనిచేస్తుందని తెలిపారు. బాధితులకు అవసరమైన సమయంలో పోలీస్ సహాయం అందించడం, వారి భద్రతకు భరోసా కల్పించడం, చట్టపరమైన మార్గాలపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడతామని వెల్లడించారు. జిల్లా ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్ నోడల్ అధికారిగా డీఎస్పీ (అడ్మిన్) గండ్రతి మోహన్ వ్యవహరించనుండగా, సభ్యులుగా సీసీఎస్ సీఐ హతీరాం, భరోసా ఎస్సై దీపిక, షీ టీమ్ ఎస్సై సునంద సహాయ సహకారాలు అందించనున్నారు.


