వ్యవసాయ మార్కెట్‌ లావాదేవీలపై ఆరా | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మార్కెట్‌ లావాదేవీలపై ఆరా

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో జరిగిన క్రయవిక్రయాలు, రైతులకు నగదు చెల్లింపులు, మార్కెట్‌ ఫీజు చెల్లింపులు, ఇతర అంశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం శుక్రవారం తనిఖీ చేపట్టింది. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అజ్మీరా రాజు మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్‌ యార్డుల పరిధిలో క్రయవిక్రయాలు, లావాదేవీలు, చెల్లింపులు, ఇతర అంశాలపై తనిఖీ చేసినట్లు తెలిపారు. రైతులకు చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా, వ్యాపారులు నెలవారీ కొనుగోలు నివేదికలు ఇస్తున్నారా, రికార్డుల్లో తక్కువ చూపి మార్కెట్‌ ఆదాయానికి గండి కొడుతున్నారా, వ్యాపారులు అవకతవకలు చేస్తున్నారా అనే అంశాలపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇతర శాఖారమైన అంశాలపై పరిశీలన చేసి రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ సంచాలకులకు నివేదిక రూపంలో సమర్పిస్తామని తెలిపారు. తనిఖీ బృందంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి నరేందర్‌, వర్ధన్నపేట మార్కెట్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఇల్లెందు మార్కెట్‌ సెక్రటరీ నరేష్‌, వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌ సూపర్‌వైజర్‌ మురళి, తొర్రూరు మార్కెట్‌ అసిస్టెంట్‌ సూపర్‌వైజ్‌ అరుణ్‌ కుమార్‌ ఉన్నారు. కార్యక్రమంలో మానుకోట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌, సెక్రటరీ వేముల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తనిఖీ చేపట్టిన మార్కెటింగ్‌ శాఖ అధికారుల బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement